Gossipsదేవదాస్ శాటిలైట్ నిర్మాతలకు షాక్..?

దేవదాస్ శాటిలైట్ నిర్మాతలకు షాక్..?

కింగ్ నాగార్జున, నానిలు కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ దేవదాస్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. మహానటి సినిమాతో చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అదే ఉత్సాహంతో దేవదాస్ సినిమా చేస్తున్నారు.
‘దేవదాస్’ల పెగ్ ఎఫెక్ట్.. మత్తులో ‘నైజాం’!
అయితే ఈమధ్య సినిమాల బిజినెస్ లెక్కలు తారుమారవుతున్నాయి. గీగా గోవిందం రిలీజ్ ముందే శాటిలైట్ చేయడంతో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా కేవలం కోటిన్నరకే ఇవ్వాల్సి వచ్చింది. అందుకే రిలీజ్ కు ముందు భారీ రేటు చెప్పాలని ఫిక్స్ అయ్యారు. ఆ క్రమంలో దేవదాస్ సినిమాకు 15 కోట్ల దాకా శాటిలైట్ రైట్స్ చెబుతున్నారట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ సినిమా బడ్జెట్టే 10 కోట్లని తెలుస్తుంది.
3
అంటే నిర్మాత కేవలం బడ్జెట్ మాత్రమే కాదు 5 కోట్ల లాభాన్ని కూడా శాటిలైట్ తో సంపాదించాలని చూస్తున్నాడు. నాగార్జునకు 3 కోట్లు ఇచ్చారట. నానికి తక్కువే ఇచ్చారట. ఎలాగు బిజినెస్ బాగుంటుంది కాబట్టి లాభాల్లో షేర్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. మొత్తానికి దేవదాస్ బిజినెస్ ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు.

2

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news