Reviewsజయం రవి "టిక్ టిక్ టిక్" రివ్యూ మరియు రేటింగ్

జయం రవి “టిక్ టిక్ టిక్” రివ్యూ మరియు రేటింగ్

జయం రవి హీరోగా శక్తి సౌందర్ రాజన్ డైరక్షన్ లో ఇండియన్ స్క్రీన్ పై మొదటి స్పేస్ సినిమాగా వచ్చింది టిక్ టిక్ టిక్. భారీ బడ్జెట్ తో ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి. గ్రాఫిక్స్ తో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఊహించని విధంగా చెన్నై నగరంలో ఆస్టరాయిడ్ (ఉల్క)లు పడుతుంటాయి. దేశాన్ని నాశనం చేసే ఉల్కల దాడి జరుగబోతుందని గుర్తించిన సైంటిస్టులు ఆ ప్రమాదం నుండి దేశాన్ని ఎలా కాపాడాలి అన్నది సినిమా కథ. ఈ ప్రమాదం నుండి ఇండియాను కాపాడాలని ఇస్రో ఓ టీం ను ఎంచుకుంటుంది. హీరో అతని బృందం ఎలా ఈ ప్రమాదాన్ని ఛేధించారు అన్నది తెర మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

జయం రవి చాలా బాగా నటించాడు. సినిమాలో మల్టిపుల్ షేడ్స్ ఉండేలా వాసు పాత్రలో ఆకట్టుకున్నాడు జయం రవి. నివేదా పేతురాజ్ కూడా తనకు ఇచ్చిన పాత్రలో ఇంప్రెస్ చేసింది. అరోన్ అజిజ్ నటన కూడా బాగుంది. సినిమా కథ కథనాలకు అనుగుణంగా రాసుకున్న పాత్రలకి నటులని అదేవిధంగా ఎంచుకున్నారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

టిక్ టిక్ టిక్ సినిమా గురించి చెప్పుకుంటే ముందు సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ఎస్.వెంకటేష్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇమాన్ మ్యూజిక్ బాగుంది. సినిమా మూడ్ కు అనుగుణంగా సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు సౌందర్ రాజన్ సినిమా కథ కొత్తగా రాసుకున్నా కథనం కాస్త గజిబిజి చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

దర్శకుడు శక్తి ఓ మంచి కథను సినిమాగా ఎంచుకున్నాడు. ఇండియా మీద ఉల్కల దాడి పై రీసెర్చ్ చేసి మరి సినిమా తెరకెక్కించాడు. అయితే ఇదే కథలో సెంటిమెంట్ తో కూడా మెప్పించాడు దర్శకుడు. ఇక స్క్రీన్ ప్లేలో కొంత ల్యాగ్ అనిపించక తప్పదు. కొన్ని లాజిక్కులు మిస్సైనట్టు అనిపిస్తుంది.

సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ బాగా ఇంప్రెస్ చేసింది. విజువల్ గ్రాండియర్ గా సినిమా అనిపిస్తుంది. మొదటిసారి అంతరిక్షం నేపథ్యంతో సినిమా వచ్చినా అంచనాలను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. కొన్ని అనవసరపు సీన్స్ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ పోగొట్టేలా చేస్తాయి.

అయితే ఇండియన్ సినిమా మరో లెవల్ కు వెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. జయం రవి, నివేదా పేతురాజ్ కలిసి నటించిన ఈ సినిమా వన్ టైం వాచర్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

జయం రవి, నివేదా పేతురాజ్

సినిమాటోగ్రఫీ

ఎడిటింగ్

మైనస్ పాయింట్స్ :

సిజీ వర్క్స్

ప్రొడక్షన్ వాల్యూస్

బాటం లైన్ :

మొదటి ఇండియన్ స్పేస్ మూవీ.. ప్రయత్నం మంచిదే కాని..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news