Gossips" ఛల్ మోహన్ రంగ " హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

” ఛల్ మోహన్ రంగ ” హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛల్ మోహన్ రంగ. త్రివిక్రం కథతో వచ్చిన ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో వచ్చింది. అయితే ఈ సినిమాలో ప్లస్సులేంటి మైనస్సులేంటి అనేవి ఇప్పుడు చూద్దాం.

సినిమాలో నితిన్ నటన, లీడ్ పెయిర్ బాగా రొమాన్స్ పండించారు. ఇద్దరిది క్రేజీ పెయిర్ అయ్యింది. స్క్రీన్ ప్లే కూడా బోర్ కొట్టకుండా సాగించారు. సినిమా దాదాపు ఫారిన్ లొకేషన్స్ కాబట్టి ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా మ్యూజిక్ తమన్ ప్రాణం పోశాడు. కచ్చితంగా యూత్ ఆడియెన్స్ కు బాగా ఎక్కేస్తుంది.

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. సినిమా కథ రొటీన్ గానే సాగుతుంది. కథ తర్వాత ఏమలుపు తిరుగుతుందో ఆడియెన్ ఊహించేస్తాడు. కథనం కాస్త బాగున్నా కథ పాతదే అని చెప్పాలి. త్రివిక్రం మార్క్ అంతగా కనిపించలేదు. అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది.

ఓవరాల్ గా సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే నితిన్ కెరియర్ లో ఈ ఛల్ మోహన్ రంగ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈరోజు సాయంత్రానికి పబ్లిక్ టాక్ బయటకు వస్తుంది. సినిమా ప్రస్తుతానికైతే మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది.

http://www.telugulives.com/telugu/chal-mohan-ranga-review/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news