Gossips"టచ్ చేసి చూడు" సెన్సార్ రివ్యూ.. ఆ హైలైట్స్ చూస్తే షాక్...

“టచ్ చేసి చూడు” సెన్సార్ రివ్యూ.. ఆ హైలైట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో రీసెంట్ గా హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నల్లమలపు శ్రీనివాస్, వళ్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇక సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా అక్కడ నుండి పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుందట. మొదటి భాగం అంతా సరదాగా సాగే కథగా ఉంటూ ఇంటర్వల్ ట్విస్ట్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో రవితేజ పోలీస్ గా వీర ప్రతాపం చూపిస్తాడట. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఫుల్ మీల్స్ విందు అంటున్నారు.

రాజా ది గ్రేట్ హిట్ తో జోష్ లో ఉన్న మాస్ రాజా ఈ సినిమాను కూడా తన హిట్స్ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. విక్రం సిరికొండ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

http://www.telugulives.com/telugu/agnathavasi-movies-compare-with-bollywood-movie/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news