Gossipsసంక్రాంతి విన్నర్ ఎవరంటే..!

సంక్రాంతి విన్నర్ ఎవరంటే..!

న్యూ ఇయర్ వచ్చింది అంటే సంక్రాంతి ఎంత స్పెషల్ పండుగో ఆ పండుగ సందర్భంగా వచ్చే సినిమాలు కూడా అంతే స్పెషల్ అని చెప్పొచ్చు. పాత రికార్డులను కొల్లగొడుతూ సరికొత్త సంచలనాలు సృష్టించేలా పొంగల్ వార్ దుమ్ముదులిపేసేలా ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతి సినిమాల సందడి అంత గొప్పగా ఏం లదని చెప్పొచ్చు. అలా ఎందుకు అంటే అజ్ఞాతవాసి నిరాశ పరచాగా.. బాలయ్య జై సింహా కేవలం ఫ్యాన్స్, బి, సి సెంటర్స్ కే పరిమితమయ్యాడు. ఇక సూర్య గ్యాంగ్ యావరేజ్ గానే అనిపించగ.. రాజ్ తరుణ్ రంగుల రాట్నం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఫలితం లేదు.

పవన్ త్రివిక్రం అజ్ఞాతవాసి :

భారీ అంచనాల నడుమ వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. లార్గో వించ్ సినిమాకు అఫిషియల్ రీమేక్ అని చెప్పినా బాగుండేది కాని సినిమా కాపీ కాదంటూనే యాజిటీజ్ దించేశాడు త్రివిక్రం. 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా 6 రోజుల దాకా కేవలం 55 కోట్ల షేర్ వసూళు చేసింది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత అజ్ఞాతవాసి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుంది అనుకుంటే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది.

బాలయ్య వీరత్వం జై సింహా :

నందమూరి బాలకృష్ణ హీరోగా కె. ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా జై సిం హా. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్ అన్నిటికంటే ఈ సినిమాలో బాలకృష్ణ వేసిన డ్యాన్స్ కూడా ఆకట్టుకున్నాయి. రొటీన్ కథే అయినా పర్వాలేదు అనేలా చేశారు. అయితే బి, సి సెంటర్స్ లో ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు.

గ్యాంగ్ తో సూర్య :

విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సూర్య నటించిన సినిమా గ్యాంగ్. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సూర్య యాక్టివ్ గా పాటిస్పేట్ చేస్తున్నాడు. అయితే మునుపటి సూర్య సినిమాల కలక్షన్స్ కన్నా ఈ సినిమా తక్కువే వసూళు చేసినా సూర్య గ్యాంగ్ మాత్రం సేఫ్ ప్రాజెక్ట్ అంటున్నారు.

రాజ్ తరుణ్ రంగులరాట్నం :

శ్రీరంజని డైరక్షన్ లో రాజ్ తరుణ్, చిత్రా శుక్ల లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా రంగులరాట్నం. ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే పెద్ద హీరోల సినిమాలు డీలా పడినా వాటి పబ్లిసిటీ ఎక్కువ ఉండటం రాజ్ తరుణ్ సినిమాకు పబ్లిసిటీ లేకపోవడం వల్ల సినిమా టాక్ బాగున్నా కలక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయి. నాగార్జున సమర్పణలో వచ్చిన ఈ సినిమా సేఫ్ ప్రాజెక్టే అంటున్నారు.

నాలుగు సినిమాల్లో పవన్ అజ్ఞాతవాసి అంచనాలను అందుకోకపోవడంతో ఈసారి సంక్రాంతి విన్నర్ గా బాలయ్య దుమ్ముదులిపేస్తున్నాడు. సినిమా బడ్జెట్ కూడా తక్కువే కావడం వల్ల వీకెండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ లోకి వచ్చేసిందట. ఇక ఇప్పుడు వచ్చే కలక్షన్స్ అన్ని లాభాలే అంటున్నారు. గ్యాంగ్ కూడా కొద్దిపాటి నష్టాలు తెచ్చేలా ఉండగా.. రంగులరాట్నం మాత్రం వసూళ్లు బాగున్నాయని చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news