Moviesఅజ్ఞాతవాసి మొదటి రోజు కలక్షన్స్.. పవర్ స్టార్ స్టామినా ఇది..!

అజ్ఞాతవాసి మొదటి రోజు కలక్షన్స్.. పవర్ స్టార్ స్టామినా ఇది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ కు ఉన్న్ర్ క్రేజ్ దృష్ట్యా ఆ సినిమా సంచలనాలకు కేంద్ర బిందువని చెప్పొచ్చు. నిన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి మొదటి రోజు రికార్డుల బద్ధలు కొట్టింది. ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారానే 1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది అజ్ఞాతవాసి. ఇక ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 28.50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసిందట.

కేవలం ఓవర్సీస్ లోనే ఈ సినిమా 8.35 కోట్ల కలక్షన్స్ సాధించింది. కేవలం ఇండియా నుండి 17.60 కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఎలాగు ఫెస్టివల్ హాలీడేస్ కాబట్టి సినిమా సంచలనలు సృష్టించడం ఖాయమని అంటున్నారు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల దాకా చేయగా సినిమా నైజాం లోనే 29 కోట్లకు బిజినెస్ చేసింది.

మరి ఈ సినిమా టోటల్ ఏరియా వైజ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. వారాంతరం కల్లా ఈ సినిమా 80 నుండి 100కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

http://www.telugulives.com/telugu/agnathavasi-review/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news