Gossipsరతిదేవిగా సమంత.. పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ లో..!

రతిదేవిగా సమంత.. పెళ్లి తర్వాత కూడా ఓ రేంజ్ లో..!

సౌత్ లో క్రేజీ బ్యూటీ అయిన సమంత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ సంపాదించింది. రీసెంట్ గా నాగ చైతన్యను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో మహానటితో పాటుగా తమిళంలో విశాల్ సరసన నటిస్తుంది. విశాల్ సినిమాలో ఇరంబు తిరైలో అమ్మడు సైకలాజికల్ డాక్టర్ గా కనిపిస్తుందట. ఇక ఈ పాత్ర పేరు రతిదేవి అని చెబుతున్నారు.

ఈ సినిమాకు సంబందించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అంతేకాదు సినిమాలో అమ్మడి రోల్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. సమంత మళ్లీ ఈ సినిమాతో మరిన్ని అవకాశాలను అందుకోవడం ఖాయమని అంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు.

పి.ఎస్ మిత్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో వస్తుంది. కచ్చితంగా సమంత పెళ్లి తర్వాత కెరియర్ లో కొత్త టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అంచనాలను మించేలా సినిమా ఉంది అంటే విశాల్ మళ్లీ ఫాంలోకి వచ్చేసినట్టే. తెలుగులో రీసెంట్ గా రిలీజ్ అయిన డిటెక్టివ్ కూడా ప్రేక్షకులను అలరించింది.samantha as rathi devi

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news