Gossipsహలో సినిమాలో కొత్త ట్విస్ట్... మరో కుర్ర హీరో ఎంట్రీ

హలో సినిమాలో కొత్త ట్విస్ట్… మరో కుర్ర హీరో ఎంట్రీ

అక్కినేని అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. కింగ్ నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 22న క్రిస్ మస్ కానుకగా రిలీజ్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీకి కలిసి వచ్చే ఈ క్రిస్ మస్ కు అఖిల్ కెరియర్ లో మొదటి హిట్ కొట్టబోతున్నట్టు కాన్ ఫిడెంట్ గా చెబుతున్నారు చిత్రయూనిట్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కూడా సర్ ప్రైజ్ ఇస్తాడని అంటున్నారు. అదేంటి సినిమాలో రాజ్ తరుణ్ ఏదైనా గెస్ట్ రోల్ చేశాడా లేక ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడా అంటే అలాంటిదేమి లేదు కాని ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ నటిస్తున్న రంగులరాట్నం సినిమా టీజర్ వస్తుందని అంటున్నారు. ఆ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తుండటం విశేషం.

సంజన డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. సినిమా రిలీజ్ కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నా అది ఇంకా కన్ ఫాం అవ్వలేదు. మొత్తానికి తనయుడి సినిమాతో పాటుగా తన నిర్మాణంలో రాబోతున్న మరో సినిమాకు ప్రమోషన్ స్టార్ట్ చేశాడు నాగార్జున. ఏది ఏమైనా నాగార్జున తెలివికి అందరు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news