Gossipsతోలి ప్రేమ సాక్షిగా వరుణ్ తేజ్ పై పవన్ అభిమానులు...

తోలి ప్రేమ సాక్షిగా వరుణ్ తేజ్ పై పవన్ అభిమానులు ఫైర్…!

ఫిదా సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో సరికొత్త ప్రేమకథతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ యంగ్ హీరో సినిమా టైటిల్ గురించే కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

మెగా హీరో పవన్ కళ్యాణ్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది తొలిప్రేమ చిత్రమే అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు అదే టైటిల్ ని వరుణ్ తేజా తన సినిమా పేరుగా వాడుకోబోతున్నాడు.
బాబాయ్ పవన్ సినిమాకి కరుణాకరన్ దర్శకత్వం వహించగా … ఇపుడు అబ్బాయి చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కథానాయకిగా రాశీఖన్నా మంచి గుర్తింపు ఉన్న పాత్రలో చేయబోతోంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో “తొలిప్రేమ”.. ‘ఏ జర్నీ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్‌ ఉండడంతో పవన్ అభిమానులు ఇదేంటి మా హీరో సినిమా టైటిల్ పెట్టేసుకున్నారని వరుణ్ తేజ పై గుర్రుగా ఉన్నారు.

‘తొలిప్రేమ’ అనే టైటిల్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో ఒక్క వరుణ్ తేజ్‌ మాత్రమే కనిపిస్తున్నాడు. పోస్టర్‌లో వరుణ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా వరుణ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని ఫిలిం నగర్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వచ్చే యేడాది ఫిబ్రవరి 9వ తేదీన ‘తొలిప్రేమ’ సినిమాని విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించారు.
పవన్ కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచిన తొలి ప్రేమ టైటిల్‌ని వరుణ్ తేజ్ మూవీకి వాడడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కొత్త దర్శకుడితో తీసే ‘తొలిప్రేమ’ చిత్రం ఫెయిల్ అయితే తమ హీరో చిత్రానికి చెడుపేరు వస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news