Gossipsఆ సినిమా లీక్ పై బాలయ్య టెన్షన్ ...?

ఆ సినిమా లీక్ పై బాలయ్య టెన్షన్ …?

నందమూరి హీరో బాలయ్యకి మళ్ళీ కోపం వచ్చింది. ఇది అలాంటి ఇలాంటి కోపం కాదు మరి. హా బాలయ్యకు ఎప్పుడు కోపం రాలేదని కొట్టిపారేయ్యకండి. ఎన్నో ఆశలతో తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి బాలయ్య అత్యంత గోప్యంగా ఉంచాలనుకున్నాడు. అయితే అనుకోకుండా టీజర్ గురించి వార్తలు బయటకి పొక్కేయ్యడంతో బాలయ్య బాగా హర్ట్ అయ్యాడట.
ఈ సినిమా టీజర్ షూట్ బిగినింగ్ అంటూ వార్తలు బయటకు వచ్చేసాయి. గురువారం షూటింగ్బు ప్రారంభం అవుతుంటే… దీనికి సంబంధించి బుధవారమే వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలయ్య తెరకెక్కిస్తుండడంతో దీని గురించి బాలయ్య కొంచెం టెన్షన్ ఎక్కువ పడ్డాడు. అసలు ఈ మ్యాటర్ ఎలా లీక్ అయిందబ్బా అని ఆరా తీస్తే.. ఈ సినిమాకు పని చేసే ఒక టెక్నీషియన్ వైపు నుంచే ఈ లీక్ వెళ్లిందని అనుమానాలు యూనిట్ లో వున్నాయి. అయితే ఆ టెక్నీషియన్ తెలుసో తెలియకో తాను చేసే సినిమాల విషయాలు బయట మనుషులకు, మీడియా కు లీక్ చేస్తున్నాడని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి.

ఇక లాభంలేదనుకుని రంగంలోకి దిగిన బాలయ్య గురువారం టీజర్ షూట్ కు సెక్యూరిటీ భారీ స్థాయిలో పెంచేసాడట. ఈ షూట్ కి కొద్దిమందే రావాలంటూ ఆదేశించడంతోపాటు.. సెల్ ఫోన్ లు దరిదాపుల్లో కూడా లేకుండా జాగ్రత్తపడ్డాడట. ఇదంతా ఎందుకంటే..? ఈ సినిమాకి సంభందించి సస్పెన్సు అంతా బాలయ్యే స్వయంగా బయటకి వెల్లడిస్తాడట అదీ సంగతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news