Gossipsనానికి దెబ్బేసిన MCA...వెనుక అసలు కారణాలివే...!

నానికి దెబ్బేసిన MCA…వెనుక అసలు కారణాలివే…!

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎం.సి.ఏ అదేనండి మిడిల్ క్లాస్ అబ్బాయ్. ఓ మై ఫ్రెండ్ తర్వాత 6 ఏళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడు చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుండి బిలో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

నాని సినిమాల హిట్ మేనియా ఈ సినిమా కూడా కంటిన్యూ చేస్తుందని అనుకోగా అంచనాలు తారుమారయ్యాయి. అయితే దీనికి కారణం సినిమాలో కథ కథనాలు సరిగా లేకపోవడమే.. కథ పాతదే అయినా కథనం కాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది కాని దర్శకుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు.

ఇక దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ లో చెప్పిన సిక్సర్ల సిద్ధాంతం కూడా తుస్సుమనేలా చేసింది ఎం.సి.ఏ. ఇప్పటికే ఈ ఇయర్ తన ప్రొడక్షన్ లో వచ్చిన 5 సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి ఎం.సి.ఏ సినిమా కూడా పక్కా హిట్ అంటూ సిక్సర్ థియరీ చెప్పాడు దిల్ రాజు. కాని నాని ఎం.సి.ఏ అంచనాలు రివర్స్ అయ్యేలా చేసింది. సినిమాల్ వదిన సెంటిమెంట్ పక్కాగా చెప్పాలంటే ఇదవరకే వాడి వదిలేసిన ఎన్నో సినిమాల కథలా ఉంటుంది.

అంతేకాదు ఎక్కడ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నట్టు కనబడదు. మరి సెకండ్ హాఫ్ సినిమాపై ఆశలు వదిలేసుకునేలా చేసింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో నాని హీరో మరి ఇంత రొటీన్ సినిమా వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇదే ఇయర్ నేను లోకల్ సినిమా కూడా నాని, దిల్ రాజు కాంబోలో వచ్చింది. కాని అందులో లవ్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయితే ఇందులో సాయి పల్లవి ఉన్నా కూడా ఏమాత్రం లాభం లేకుండా పోయింది. మొదటి షో అయితే డివైడ్ టాక్ రాగా ఫైనల్ గా సినిమా యావరేజ్ గా మిగులుతుందో లేదో వీకెండ్ వరకు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news