Gossipsకత్రీనా ఏడిస్తే ..సల్మాన్ ఆనందంతో డాన్స్... కారణం తెలిస్తే షాకే..?

కత్రీనా ఏడిస్తే ..సల్మాన్ ఆనందంతో డాన్స్… కారణం తెలిస్తే షాకే..?

బాలీవుడ్ అందాల భామ కత్రీనా కైఫ్ ఏడ్చేసిందట ! ఆమె ఏడ్పు ఆపించడానికి సల్మాన్ ఖాన్ చెయ్యని ప్రయత్నమే లేదట. ఇంతకీ విషయం ఏంటంటే.. ఏక్ థా టైగర్ సినిమా తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా తాజాగా వస్తున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’. ఈ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 అయితే.. ఈ  చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా కత్రినా, సల్మాన్‌ ‘డ్యాన్స్‌ ఛాంపియన్స్‌’ అనే రియాల్టీ షోలో న్యాయ నిర్ణేతలుగా వెళ్లారు.ఆ కార్యక్రమంలో  బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో ఆ షో లో పాల్గొన్నవారంతా షాక్ తిన్నారు. అయితే కత్రినాను నవ్వించడానికి సల్మాన్‌ ఖాన్‌ చేసిన ప్రయత్నం నెటిజన్లనే కాదు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది
. సల్మాన్‌ డ్యాన్స్‌ షోకి వచ్చిన సందర్భంగా ఓ జట్టు ఆయన నటించిన ‘తేరే నామ్‌’ చిత్రంలోని టైటిల్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌ చూసి కత్రినా కంట తడి పెట్టారు. దాంతో షో నిర్వాహకులు కొద్దిసేపటి వరకు చిత్రీకరణ నిలిపివేశారు. ఆ తర్వాత సల్మాన్‌ కత్రినాను నవ్వించడానికి ఆయన నటించిన ‘సుల్తాన్‌’ చిత్రంలోని ‘జగ్‌ ఘూమెయా..’ అనే పాటకు డ్యాన్స్‌ కూడా చేశారు. ఆ డ్యాన్స్‌ చూసి కత్రినా వెంటనే నవ్వడం మొదలెట్టేశారట. అంతేకాదు సల్మాన్‌తో కలిసి ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రంలోని ‘దిల్‌ దీవానా’ అనే పాటకు డ్యాన్స్‌ కూడా చేసి అక్కడ ఉన్నవారందరిలో మంచి జోష్ నింపారు.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news