Movies'హలో' కథ లీక్ చేసిన నాగ్ ! కారణం ఏంటో ..?

‘హలో’ కథ లీక్ చేసిన నాగ్ ! కారణం ఏంటో ..?

మన్మధుడు నాగార్జున ఏమి చేసినా కొత్తగా ఉండేలా చేస్తాడు. ఆయన రూటే సెపరేటు. ఇక ఈ మధ్య తన గారాల కొడుకు అఖిల్ సినిమా హలో మీద నాగ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ మీద తన ద్రుష్టి పెట్టడమే కాకుండా .. ఆ సినిమా యూనిట్ కంటే ఎక్కువ నాగార్జునే కష్టపడుతున్నాడు. అఖిల్ మొదటి సినిమా భారీ డిజాస్టర్ కావడంతో ఎలా అయినా ఈ చిత్రాన్ని హిట్ చేయించి అఖిల్ కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నాగ్ కలలు కంటున్నాడు.
తాజాగా ఈ సినిమా గురించి ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. త‌న‌యుడి హ‌లో సినిమా క‌థ మొత్తం చెప్పేసాడు నాగ్. కావాల‌ని చెప్పాడో లేక అలా వ‌చ్చేసిందో తెలియ‌దు కానీ హ‌లో క‌థ ఇదేనంటూ నాగ్ బయటపెట్టేసాడు. ఈ క‌థ మొత్తం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 మ‌ధ్య జ‌రుగుతుంద‌ని చెప్పాడు నాగార్జున‌. 15 ఏళ్లుగా తాను ఎదురుచూస్తోన్న ప్రేయ‌సిని క‌లిసి హ‌లో చెప్పాల‌నుకునే ప్రేమికుడి క‌థే ఈ హ‌లో అని చెప్పాడు ఈ మన్మధుడు.

హ‌లో సినిమా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కాబోతోంది. ఈ లోగా నాగ్ స్టోరీ ఎందుకు లీక్ చేసినట్టో ఎవరికీ అర్ధం కావడంలేదు. సినిమా రేంజ్ ని పెంచడానికే నాగ్ ఇలా చెప్తున్నదా అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. అయితే ఈ సినిమా ఎంతవరకువిజయం సాధిస్తుందో, నాగ్ కష్టానికి ప్రతిఫలం దక్కి ఈసారైనా అఖిల్ సక్సెస్ అందుకుంటాడా లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news