Gossipsనాని వర్సెస్ అఖిల్.. ఊహించని విధంగా దేబ్బెశాడు..!

నాని వర్సెస్ అఖిల్.. ఊహించని విధంగా దేబ్బెశాడు..!

స్టార్ సినిమాల ఫైట్ ఎలా ఉన్నా యువ హీరోల ఫైట్ కూడా ఈమధ్య ఆసక్తికరంగా మారింది. ప్రయోగాత్మక సినిమాలతో యువ హీరోలు తమ జోష్ కొనసాగిస్తున్నారు. ఇక వరుస హిట్లతో ఉన్న నాని సినిమా అంటే హిట్ కన్ఫాం అన్న పరిస్థితి వచ్చింది. నాని సినిమా అంటే నాని నాచురల్ నటన.. కాసిన్ని నవ్వులు.. మనసుని తాకే ఎమోషన్.. ఉత్సాహపరచే ఎంటర్టైన్మెంట్.. ఫలితం సినిమా సూపర్ హిట్.

ఇదే ఫార్ములాతో కథ అటు ఇటుగా ఉంటున్నా హిట్ల మీద హిట్లు కొడుతూ వస్తున్నాడు నాని. ఇక ఈసారి కూడా వదిన సెంటిమెంట్ తో ఎం.సి.ఏ అంటూ వచ్చాడు నాని. నిన్న రిలీజ్ అయిన ఎం.సి.ఏకు డివైడ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ మరి దారుణం అంటున్నారు. కథ కథనాలేవి ఆడియెన్స్ అంచనాలు అందుకోలే.. ఈసారి నాని మ్యాజిక్ కూడా వర్క్ అవుట్ కాలేదని అనిపిస్తుంది.

ఇక పోటీగా రంగంలో దిగిన అఖిల్ హలో సినిమా ఈరోజు వచ్చింది. విక్రం కుమార్ బ్రాండ్ తో నాగార్జున నమ్మకంతో వచ్చిన ఈ సినిమా ఫలితం కూడా పాజిటివ్ గానే వచ్చింది. సినిమా ప్రీమియర్ షో నుండే హిట్ అన్న టాక్ వచ్చింది. ఓ సెన్సిబుల్ సబ్జెక్ట్ తో తనదైన స్క్రీన్ ప్లేతో అలరించాడు విక్రం కుమార్. ఇక హీరోగా అఖిల్ రెండో సినిమా నటన మీద మంచి గురి పెట్టాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఫైనల్ గా ఎం.సి.ఏ అదేనండి మిడిల్ క్లాస్ అబ్బాయి తో పోటీగా దిగిన హలో డిస్టింక్షన్ లో పాస్ అవగా.. నాని ఎం.సి.ఏ మాత్రం పాస్ మార్కులు సంపాదిచాడని అంటున్నారు. నాని ఇదవరకు సినిమాల క్రేజ్ తో కలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అఖిల్, నానిల సినిమాల ఫైట్ లో ఈసారి అఖిల్ నెగ్గాడని చెప్పేయొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news