Gossipsరెడ్లను కెలుకుతున్న వర్మ !

రెడ్లను కెలుకుతున్న వర్మ !

ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ తో మీడియాలో కనిపిస్తూ కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నవ్యక్తి ఇండ్రస్ట్రీలో ఎవరన్నా ఉన్నారా అంటే అది ఒక్క రాంగోపాల్ వర్మ మాత్రమే. అంధారు సాధారణం గా వివాదాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు కానీ వర్మ మాత్రం వెతుక్కుని మరీ వివాదాల్లో తలదూర్చి దట్ ఈజ్ వర్మ అని అనిపించుకుంటాడు.

గిల్లి గిల్లిచ్చుకోవడం కూడా వర్మకి బాగా అలవాటు అందుకే ఎప్పుడూ వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తూ వార్తల్లో ఉంటాడు. తాజాగా ‘కడప రెడ్ల నిజాలు’ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను వర్మ ప్లాన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో రాయలసీమ నిజాల్ని పూర్తిగా బయటపెడతానంటున్నాడు వర్మ. గతంలో తాను తీసిన ‘రక్త చరిత్ర’ లో రాయలసీమ గురించి చూపింది ఐదు శాతం మాత్రమేనని, అప్పటి పరిస్థితుల వలన అలా చేసారని చెప్తున్న వర్మ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

హింస, రక్తదాహం, ఆధిపత్యం, ఇగో, ఆశ, వెన్నుపోట్లు లాంటి రకరకాల మనిషి నైజాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన ప్రాంతం నుండి ఈ ‘కడప’ టైటిల్ పుట్టిందని, మాజీ ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ బంధువులు, బాధితులు, ఇతరుల నుండి తాను రాబట్టిన మెటీరియల్ ద్వారా ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాని వర్మ చెప్పుకొస్తున్నాడు. ఈ ట్రైలర్ ను రేపు ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తానని వర్మ చెప్పుకొస్తున్నాడు. ఏమైనా వర్మ కు ఉన్న ధైర్యం నిజంగా మెచ్చుకోవాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news