Gossipsప్రభాస్ నిహారిక పెళ్లి గాసిప్స్ పై 'మెగా' ఆగ్రహం

ప్రభాస్ నిహారిక పెళ్లి గాసిప్స్ పై ‘మెగా’ ఆగ్రహం

పెళ్లి … ఈ టాపిక్ చాలా కాలంగా ప్రభాస్ ని ఇరుకున పెట్టేస్తోంది. పెళ్ళికి సంబంధించి ఏ వార్త వచ్చినా దాంతో ప్రభాస్ పెళ్ళికి ముడి పెట్టి మరీ వార్తలు అల్లేస్తున్నారు. తెలుగు ఇండ్రస్ట్రీలో పెళ్లికాని ప్రసాద్ లా మిగిలిపోయిన ప్రభాస్ మీద రూమర్లు చాలానే వస్తున్నాయి. భీమవరానికి చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి అని ఒకసారి .. విశాఖ అమ్మాయితో అని, అనుష్క తో పెళ్లి అని ఒకసారి … ఇప్పుడేమో మెగా ఫ్యామిలీ అమ్మాయి నిహారికతో పెళ్లి అని ఇలా ఒకటేంటి ప్రభాస్ పెళ్లి మీద రాని పుకారంటూ లేదు.

కొద్ది రోజులుగా ఒక వార్త బాగా హడావుడి చేసేస్తోంది అదేంటంటే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో ప్రభాస్ పెళ్లి జరగబోతోందని సోష‌ల్ మీడియాలోని ప‌లు వెబ్‌సైట్ల‌లోనే కాదు, యూ ట్యూబ్‌లో కూడా ఈ వార్త‌లు జోరుగా వార్తలు హల్ చల్ చేసాయి. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక తెలుగుతో పాటు ప‌లు త‌మిళ సినిమాల్లో కూడా న‌టిస్తోంది.

నిహారిక , సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంటూ కొంత కలం క్రితం వార్తలు వచ్చాయి. .మళ్ళీ ఇప్పుడు నిహారిక ప్ర‌భాస్ పెళ్లి అని వార్తలు రావడంతో … ఈ వార్త‌ల‌పై మెగాస్టార్ సీరియ‌స్ అయిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక అంటే చిరుకి చాలా ఇష్టమనీ ఎంతో గారాబంగా చూసుకుంటారని అటువంటిది ఆమె మీద ఇలా నిత్యం గాసిప్స్ రావడంతో చిరు మండిపడుతున్నారట. మళ్ళీ ఇటువంటి వార్తలు రాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు చిరు సూచించాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news