Gossipsఆ పార్టీలోకి నిఖిల్

ఆ పార్టీలోకి నిఖిల్

స్వామిరారా సినిమాతో కెరీర్ టర్నింగ్ తీసుకుని ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ వంటి సినిమాలతో నిఖిల్ కార్తికేయ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. చిన్న హీరో గా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ పెద్ద హీరోల స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా తాను ఎంచుకునే కధలు వైవిధ్యభరితంగా ఉండేలా చూసుకుని మంచి గుర్తింపు సంపాదిస్తున్నాడు.

ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా అనే థ్రిల్ల‌ర్ మూవీతో అల‌రించిన‌ నిఖిల్, ఆ త‌ర్వాత కేశ‌వ అనే రివెంజ్ డ్రామా చిత్రంతోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా తన కొత్త చిత్రాన్ని.. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న‌ట్టు సమాచారం. ఈ చిత్రం క‌న్నడ హిట్ చిత్రం కిరిక్ పార్టీ రీమేక్ కాగా, ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానరుపై డెబ్యూ ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రానికి చందూ మొండేటి డైలాగ్స్ రాసాడు. సుధీర్ వ‌ర్మ స్క్రీన్ ప్లే అందించాడు.

నిఖిల్ 15వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా హెగ్డే, సిమ్రాన్ పరీన్జా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. అజ‌నీష్ లొక‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సరికొత్త క‌థాంశంతో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, తాజాగా ప్రీ లుక్ విడుద‌ల చేసింది ఆ సినిమా యూనిట్‌.

ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో గోడ‌ల‌పై ఓట్ ఫర్ కృష్ణ , రివొల్యూషన్ బీ ఏ రెబల్ అనే కొటేష‌న్స్ తో పాటు చెగువేరా, క్రికెట్ బ్యాట్ ఉన్నాయి. ఈరోజో రేపో ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రీ లుక్‌తో ఈ సినిమా కూడా ప్ర‌యోగాత్మ‌కంగానే ఉంటుంద‌నే అభిప్రాయాన్ని జనాల్లో కలిగించగలిగింది ఈ చిత్ర యూనిట్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news