Gossipsఅఖిల్ ని చూసి చిరు భార్య బాధపడుతోందా ..?

అఖిల్ ని చూసి చిరు భార్య బాధపడుతోందా ..?

అఖిల్ ని చూసి మెగా ఫ్యామిలీ బాధపడుతోందా…? అఖిల్ ను మెగా వారసుడిని చేసుకోవాలనుకున్నారా ..? అంటే చిరు ఫ్యామిలీ అవుననే అంటోంది. అఖిల్ అంటే చిరు సతీమణి సురేఖకు చాలా అభిమానమాట. అందుకో ఒక దశలో అఖిల్ ని పెంచుకోవాలని చిరు ఫ్యామిలీ అనుకున్నారట. ఈ విషయాలన్నీ ఎవరో చెప్పినవి కాదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చెప్పినవే. ఇలా చిరు ఫ్యామిలీ అనుకోవడానికి చాలా రిజనే ఉందట.

అఖిల్ అందరితోనూ చాలా సరదాగా ఉండడమే కాదు. మా ఇంటికి తరచూ వస్తుంటాడు. ఎందుకంటే రాంచరణ్ – అఖిల్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. మా ఇంటికి వచ్చినప్పుడు చెర్రీ ని కలిసే ముందుగానే సురేఖ దగ్గరకు వెళ్లి యోగ క్షేమాలు విచారించి అప్పుడు అప్పుడు చెర్రీని కలవడానికి వెళ్తాడట. అంతే కాదు పెద్దలంటే చాల మర్యాదగా ఉండడమే కాకుండా … చాలా చక్కగా మాట్లాడుతూ ఉండడంతో చిరు భార్య సురేఖ ఒక దశలో భావోద్వేగానికి గురయ్యిందట.

చెర్రీ కి తమ్ముడు కూడా ఉంటే ఎంతో బాగుండేది కదా అని చిరంజీవి దగ్గర ప్రస్తావించడంతో … అప్పుడు ఎందుకు లేదు మనం అఖిల్ నే దత్తత తీసుకుందాం అని చిరు చెప్పాడట. ఈ విషయాలు అన్నిటిని స్వయంగా మెగా స్టార్ స్వయంగా ‘హలో’ మూవీ ఫంక్షన్ లో చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి మెగా ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి ఎంత అనుబంధం ఉందో ఇట్టే అర్ధం అయిపోతుంది కదా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news