Gossipsఅల్లుశిరీష్ కి చిరు షాక్ ..

అల్లుశిరీష్ కి చిరు షాక్ ..

అల్లు శిరీష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్‌ను ఇంటికి రావాల్సిందిగా కబురు పంపాడట. రాత్రి ఇంటికి ఎందుకు రమ్మంటున్నారో.. అది కూడా నన్ను మాత్రమే రమ్మంటున్నారు.. ఎందుకో అర్థం కాక అల్లు శిరీష్ భయంభయంగా ఉదయం ఇంటికి వెళ్ళాడట. అయితే అక్కడకు భయపడుతూ వెళ్లిన ఆ హీరో కి చూరు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడట.

అల్లు శిరీష్‌‌ను మెగా స్టార్ గట్టిగా హత్తుకుని చాలా బాగా చేశావ్ శిరీష్‌. నీ నటన చాలా బాగుంది. ఒక్క క్షణం సినిమా కథ కూడా చాలా బాగుంది అంటూ ప్రశంసలతో శిరీష్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేసాడట చిరు. దీంతో శిరీష్‌ ఆనందానికి అవధుల్లేవట. నేరుగా ఇంటికి వెళ్ళి అల్లు అరవింద్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడట. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి నన్ను మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెగ ఆనందపడిపోయాడట.

అంతకు ముందు శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే అల్లు శిరీష్‌ సక్సెస్ సాధించగా అంతకు ముందు వచ్చిన గౌరవం సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో చాలా కాలంగా హిట్ కోసం వెతుకుతూ ఉండగా ఇలా ఒక్క క్షణం సినిమాతో శిరీష్‌ విజయాన్ని అందుకున్నాడు. అల్లు శిరీష్‌ చాలా కాలం తరువాత ఒక్కక్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఈ సినిమా నిన్న విడుదలై హిట్ టాక్‌తో ముందుకు వెళుతోంది. దీంతో చిరు ఫ్యామిలీ కూడా మంచి హ్యాపీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news