Gossipsసమంత అతని కోసం అంత ఖర్చు పెట్టిందా ..?

సమంత అతని కోసం అంత ఖర్చు పెట్టిందా ..?

సమంత హవా ప్రస్తుతం సౌత్ లో ఏ స్థాయిలో కొనసాగుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా సమంత తన లైఫ్ ను ఏ మాత్రం మార్చుకోకుండా కంటిన్యూ చేసేస్తోంది. ఇక ఎప్పటిలానే అమ్మడికి భారీ రెమ్యునేషన్ లు కూడా అందుతున్నాయి.

అందంతోనే కాదు మంచితనంతో కూడా ఈమెకు ఎవరూ పోటీ లేరు అని మరోసారి నిరూపించుకుంది.
తను సంపాదిస్తోన్న దాంట్లో కొన్ని మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. తాజాగా ఈ అక్కినేని కోడలు తన మేనేజర్ కి కూడా హెల్ప్ చేసిందట. మహేందర్ అనే వ్యక్తి ఎప్పటినుంచో సౌత్ లో సమంత దగ్గర మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడు.

ఈ మధ్య ఆయన కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. తాజాగా నారా రోహిత్ తో కలిసి బాలకృష్ణుడు అనే సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా రిలీజ్ చేయడానికి కొద్దీ రోజులే సమయం ఉండడంతో ఆయన సినిమా షూటింగ్ ఎండింగ్ లో కాస్త డబ్బు లేక ట్రబుల్ అయ్యారట. దీంతో సమంత ఫైనాన్షియల్ గా 3 కోట్ల వరకు హెల్ప్ చేసి ఆర్ధికంగా ఆదుకుందట. ఈ వార్త బయటకి పొక్కడంతో సమంత మీద ప్రశంసల వర్షమే కురుస్తోంది. ఇంత మంచి హృదయం ఎవరికీ ఉంటుంది అని ఆమె అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news