Gossipsఎమ్మెల్యే గా పోటీచేస్తున్న కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న కళ్యాణ్ రామ్

నంద‌మూరి కుటుంబానికి రాజ‌కీయాలేం కొత్త కాదు
న‌ట‌న, రాజ‌కీయ రంగం రెండూ రెండు క‌ళ్లుగా చేసుకుని
దూసుకుపోయిన వైనం మ‌నంద‌రికీ తెల్సిందే!
తాజాగా.. క‌ల్యాణ్ రామ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగారు.
తానేంటో త‌న స‌త్తా ఏంటో నిరూపించుకోనున్నారు.
ఇంత‌కూ ఆ రీల్ లైఫ్ క‌బుర్లు ఏంటంటే..?

కల్యాణ్‌రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంఎల్ఎ’. కళ్యాణ్‌రామ్‌తో ‘లక్ష్మీకళ్యాణం’ తర్వాత కాజల్ నటిస్తున్న చిత్రం కావడం, ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత మరోసారి అదే తరహా పాత్రలో కాజల్ నటిస్తుండ‌డం విశేషం. ఇప్ప టికే భారీ అంచనాలున్న ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైర‌ల్ అవుతోంది.‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన’ అంటూ కళ్యాణ్‌రామ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విప రీతంగా నెట్‌చల్ చేస్తోంది.ఇది కూడా మరో ‘నేనే రాజు నేనే మంత్రి’ తరహాలో ఈ చిత్రం ఉండబోతుందనే వార్తలు ఈ పోస్టర్ చూసిన తర్వాత వస్తు న్నాయి. అలాగే మా ఓటు ట్యాప్ గుర్తుకే అంటూ నెటిజన్లు ఈ పోస్టర్‌కి రిప్లైలు ఇస్తున్నారు. మొత్తానికి క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాతో ఫాంలోకి వ‌చ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం కావాల‌న్న‌ది అభిమానుల కోరిక‌. ఏదేమైన‌ప్ప‌టికీ కాజ‌ల్ అందాలు ఈ చిత్రానికో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని, ల‌క్ష్మీ క‌ల్యాణం త‌రువాత వీరిద్ద‌రూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయ‌డం ఇదే క‌నుక చిత్రంపై ఆశించ‌ద‌గ్గ స్థాయిలో అంచ‌నాలున్నాయ‌ని యూనిట్ చెబుతోంది. వాటిన‌న్నింటినీ అందుకునేలా త‌మ చిత్రం ఉండ‌బోతోంద‌ని హామీ ఇస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news