Gossipsఅందం ఉంటే సరిపోదు... ఆ టైంకి అక్కడికి వెళ్తేనే

అందం ఉంటే సరిపోదు… ఆ టైంకి అక్కడికి వెళ్తేనే

బాహుబ‌లి సిరీస్ త‌రువాత బాగ్ మ‌తితో బిజీ అయిపోయింది

దీని త‌రువాత చిరుతో  తెర పంచుకోనుంద‌ని టాక్

సైరాలో ఆమె ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని తెలుస్తోంది

ఇకపై అందంతో పాటు అభిన‌య ఉన్న పాత్ర‌లే పోషించేందుకు ఎక్కువ‌

ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెబుతోందీ ఈ యోగా టీచ‌ర్

ఇంకా ఆమె ఏమ‌న్నదంటే..  :: ‘‘అందంగా ఉన్నంత మాత్రాన కథానాయికలుగా రాణిస్తారనుకోవడం భ్రమే. అదో అర్హత మాత్రమే! కథానాయికలకు చాలా విషయాల్లో అవగాహన ఉండాలి.అన్నింటికంటే ముందు కెమెరా సెన్స్‌, సైన్స్ రెండూ అర్థం కావాలి. వీటిపై అవగాహ‌న పెంపొందించుకోవాలి. కేవ‌లం అందంగా ఉంటే ఇక్కడ రాణిస్తామనుకోవడం పొరపాటు. క్రమశిక్షణ కూడా చాలా అవసరం.

‘ఫలానా కథానాయిక చెప్పిన సమయానికి సెట్ కి వస్తుంది’ అని చెప్పుకొంటే సగం మార్కులు అక్కడే పడిపోతాయి.ఆ..తరవాతే గ్లామర్‌, అదృష్టం. పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడం, అంచ‌నావేయ‌డం, అందుకు తగ్గట్టు సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ప్రతీచోటా.. ప్ర‌తీ రంగంలోనూ ఎదిగేందుకు ఈ ల‌క్ష‌ణాలే కీల‌కం అవుతాయి. సినిమా పరిశ్రమలో అయితే ఇవి ప్రాథమిక సూత్రాలు మాత్రమే’’ అని అంటోంది. కాగా ఆమె న‌టించిన భాగ్‌మ‌తి వ‌చ్చేఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల కానుంది.

ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తుండ‌గా, పిల్ల జ‌మిందార్ ఫేం అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. అనుష్క పుట్టిన రోజు (నవంబ‌ర్ ఏడు) న ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news