Gossipsఒక్క క్షణం కోసం పట్లు పడుతున్న అల్లు శిరీష్

ఒక్క క్షణం కోసం పట్లు పడుతున్న అల్లు శిరీష్

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు వారి అబ్బాయి శిరీష్ తాజాగా ‘ఒక్క క్షణం’ అంటున్నాడు. వి. ఆనంద్‌ దర్శకత్వంలో డిసెంబరు 23న విడుదల కాబోతున్న ఈ సినిమాలో కధానాయకుడిగా అల్లు శిరీష్ నటిస్తుండగా.. కథానాయకిగా సురభి నటిస్తోంది. ఈ చిత్ర లోగోను కూడా తాజాగా ఆవిష్కరించారు.

బెంగళూరులో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం శిరీష్ దాదాయపు నెలరోజులపాటు అక్కడే ఉండిపోయాడు. అక్కడ ఆ సినిమా సెట్ కి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా వెళ్లి చిత్ర యూనిట్ ని అభినందించారు. పునీత్‌ సోదరుడు శివకుమార్‌ నటించిన ‘తగరు’ సినిమా ఆడియో విడుదల వేడుకకు అతిథిగా ఇటీవల శిరీష్ హాజరయ్యాడు.

తాజాగ్గా శిరీష్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది . సినిమాలో శిరీష్ లుక్ చాలా కొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు కనిపించని లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఫస్ట్ యానివర్సరీ సందర్బంగా ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు చిత్ర దర్శకుడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news