Gossipsరామ్ ఓ 'ప్లే బోయ్'.. దేవి బయటపెట్టిన నిజం..!

రామ్ ఓ ‘ప్లే బోయ్’.. దేవి బయటపెట్టిన నిజం..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉన్నది ఒకటే జిందగి. నేను శైలజ తర్వాత రామ్ ను కొత్తగా చూపిస్తూ వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు.

ఇక ఈ ఆడియో ఈవెంట్ లో రామ్ ఉత్సాహంతో ఇచ్చిన స్పీచ్ హైలెట్ అవగా సంగీత దర్శకుడు దేవి మాట్లాడిన తీరు కూడా అందరిని షాక్ అయ్యేలా చేసింది. రామ్ దేవి ఇద్దరు చాలా క్లోజ్.. రామ్ ను దేవి రామ్ బాయ్ అంటాడట.. దేవిని రామ్ దేవి బాయ్ అంటాడట. అయితే రామ్ బాయ్ మాత్రమే కాదు మంచి ప్లే బోయ్ కూడా అనేశాడు డిఎస్పి.

మరి ఏ ఉద్దేశంతో రామ్ ను ప్లే బోయ్ అనేశాడో కాని దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంత అందంగా ఉంటే ప్లే బోయ్ అనక ఏమంటారు అన్నాడు దేవి శ్రీ ప్రసాద్. మొత్తానికి రామ్ మీద ఓ డౌట్ వచ్చేలా ప్లే బోయ్ బిరుదు ఇచ్చాడు డిఎస్పి. కాబట్టి రామ్ ఇక జాగ్రత్త పడక తప్పదు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news