Gossipsరాజా ది గ్రేట్ బయ్యర్స్ సేఫా..కాదా.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్

రాజా ది గ్రేట్ బయ్యర్స్ సేఫా..కాదా.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్‌. రవితేజ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడం, పైగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పటాస్‌, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో రాజా ది గ్రేట్‌పై రిలీజ్‌కు ముందే అంచనాలు ఉన్నాయి. బుధవారమే థియేటర్లలోకి దిగిన ఈ సినిమాకు లాంగ్ వీకెండ్‌, దీపావళి కలిసొచ్చాయి. తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా.

ఇక ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో రూ.24.25 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ21.45 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజకు ఇవి కెరీర్ పరంగా బెస్ట్ వసూల్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు పోటీ సినిమాలు లేకపోవడంతో పాటు రాజు గారి గది 2 బాక్సాఫీస్ వద్ద డల్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసిరానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
రాజా ది గ్రేట్ ఏరియా వైజ్ ఫస్ట్ వీక్ షేర్ ఇలా ఉంది…

నైజాం – 8.75
సీడెడ్ – 3.20
ఉత్తరాంధ్ర – 2.96
వెస్ట్ – 1.30
ఈస్ట్ – 1.63
కృష్ణా – 1.41
గుంటూరు – 1.45
నెల్లూరు – 0.75
————————————
ఏపీ, తెలంగాణ = రూ.21.45 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 1.60
రెస్ట్ అఫ్ వరల్డ్ – 1.20

టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రూ.24.25 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news