Gossipsమహేష్ 25 టైటిల్ ఫిక్స్..!

మహేష్ 25 టైటిల్ ఫిక్స్..!

స్పైడర్ నిరాశ పరచిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ భరత్ అను నేను మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు మహేష్. సినిమా పక్కా హిట్ ఫార్ములాతో రాబోతుందట. ఇక ఈ సినిమాతో పాటుగా మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

రెండు టైటిల్స్ వినిపిస్తున్న ఈ సినిమాలో ఏది ఫైనల్ టైటిల్ అన్నది తెలియలేదు. హరే రామ హరే కృష్ణ.. కృష్ణా ముకుందా మురారి టైటిల్స్ పరిశీలణలో ఉన్నాయట. ఈ రెండు టైటిల్స్ లో ఒకటి మహేష్ టైటిల్ అవుతుందని తెలుస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ ట్రీట్ మెంట్ తో ఉంటుందట.

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దెని అనుకోగా ఆమె ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేశారట. త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ సినిమాతో మహేష్ తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news