Gossipsమహానటుడు బయోపిక్ లో కట్టప్ప

మహానటుడు బయోపిక్ లో కట్టప్ప

బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్
ఇలా ప‌రిశ్ర‌మ‌లో అయినా ఓ ఫార్ములాని అనుస‌రించాల్సిందే
నాలుగు హిట్ సినిమాల‌ను చూసి మ‌రో హిట్ సినిమా తీయాల్సిందే
లేదంటే జీవిత క‌థ‌ల‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం ఒక‌టి చేయాల్సిందే
ఇప్పుడిదే జ‌రుగుతోంది. బాలీవుడ్ లో ప‌ద్మావ‌తి టాలీవుడ్ లో భాగ్ మ‌తి
సినిమాలు రూపొందుతున్న త‌రుణంలోనే మ‌రో బ‌యోపిక్ టాక్ వెలుగులోకి వ‌చ్చింది.
ఆ..వివ‌రాలిలా..
ప్రస్తుతం అన్ని భారతీయ సినీపరిశ్రమల్లోనూ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది.అందులోనూ సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ కి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే తెలుగులోఅల‌నాటి న‌టి సావిత్రిపై మ‌హాన‌టి నిర్మితం అవుతుండ‌గా, నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా మ‌రో రెండు చిత్రాలు రూపొందేందుకు సిద్ధంగా ఉన్నాయి.తాజాగా తమిళంలో అలనాటి సూపర్ స్టార్ ఎంజీఆర్ రియల్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్ నిర్మాణా నికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ పాత్రలో కనిపించబోయే నటుడు ఎవరో కాదు… బాహుబలి సినిమాతో బాలీవుడ్ లోనూ ఫేమ‌స్ అయిన కట్టప్ప పాత్రను పోషించిన సత్యరాజ్. ఔను! సీనియర్ న‌టుడు సత్య రాజ్ మ‌హాన‌టుడు ఎంజీఆర్ పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది.కోలీవుడ్ అప్‌డేట్స్ ప్రకారం బాలకృష్ణన్ డైరెక్ట్ చేయ నున్న ఈ సినిమాను రమణ కమ్యునికే షన్స్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది.త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఒక‌టి వెలువ‌డ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news