Gossipsజై లవ కుశ మాత్రమేనా బిగ్ బాస్ కూడా.. నాగార్జున అప్పుడే...

జై లవ కుశ మాత్రమేనా బిగ్ బాస్ కూడా.. నాగార్జున అప్పుడే చెప్పాడు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ రికార్డులతో చెడుగుడు ఆడిన ఎన్.టి.ఆర్ తనకున్న మాస్ ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని అదే తరహాలో సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్యలో కింద పడినా అదే ఉత్సాహంతో మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు.

ఇక తారక్ ఇప్పుడు కేవలం సిల్వర్ స్క్రీన్ స్టార్ మాత్రమే కాదు బుల్లితెర బాద్షా.. జై లవ కుశతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్ బిగ్ బాస్ హోస్ట్ గా వారెవా అనిపిస్తున్నాడు. ఎప్పుడూ ఎన్.టి.ఆర్ లో సీరియస్ నెస్ చూసే బుల్లితెర ఆడియెన్స్ రియల్ లైఫ్ లో అతను ఎంత చలకీగా జోవియల్ గా ఉంటాడో అని తెలిసేలా చేశాడు.

అయితే ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన మనిషి మరొకరు ఉన్నారు అతనే కింగ్ నాగార్జున. బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన సమయంలో నాగార్జున తారక్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. తను బయట ఎలా ఉన్నాడో అలా షోని నడిపించడం బాగుందని కామెంట్ పెట్టాడు. ఇక ఈ విషయాలను బట్టి చూస్తే తారక్ ఈ షో ఇరగదీస్తాడు అని నాగార్జున అప్పుడే చెప్పాడని గుర్తు చేసుకోవాలి. మొత్తానికి తారక్ సినిమా రిలీజ్ టైంలో చేస్తున్న బిగ్ బాస్ కూడా బాగా ప్రమోషన్స్ చేస్తుంది. మరి ఇంత హంగామా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news