Newsకుర్ర హీరోకి ధైర్యం ఎక్కువే..!

కుర్ర హీరోకి ధైర్యం ఎక్కువే..!

ఎవడే సుబ్రమణ్యం సినిమాలో ఫ్రెండ్ పాత్ర చేసిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు స్టార్స్ సైతం అవాక్కయ్యేలా కలక్షన్స్ సాధించింది. ఇక ఆ హిట్ క్రేజ్ ను వాడేస్తున్న విజయ్ కెరియర్ విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు.

ద్వారకతో పర్వాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రన్ టైం విషయంలో పెద్ద ధైర్యం చేస్తున్నారు చిత్రయూనిట్. ఏకంగా 2 గంటల 55 నిమిషాల సినిమాగా అర్జున్ రెడ్డి వస్తుంది. అంటే దాదాపు 3 గంటల సినిమా అన్నమాట. కంటెంట్ లోని దమ్ము ప్రేక్షకులను అంత సేపు కూర్చోబెడుతుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.

కొత్త కథలకు ఊతమిస్తున్న తెలుగు ప్రేక్షకులను అలరించడానికి అర్జున్ రెడ్డి ఓ కొత్త కథతో రాబోతుందట. అందుకే ఈ సినిమా తప్పకుండా ఎంత రన్ టైం ఉన్నా సరే అలరిస్తుందని చెబుతున్నారు. విజయ్ లాంటి కుర్ర హీరో ఇలాంటి రన్ టైం కలిగిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం కచ్చితంగా తన గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. ఈ శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news