Newsజనసేన తో రిజిస్టర్ అవ్వండి .. పవన్ కళ్యాణ్ ని కలవండి

జనసేన తో రిజిస్టర్ అవ్వండి .. పవన్ కళ్యాణ్ ని కలవండి

“ఉత్తరాంధ్ర – గ్రేటర్ హైదరాబాద్ లలో జరిగే జనసేన గుర్తింపు శిబిరాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 17 – 18 తేదీల్లో శ్రీకాకుళం – 19 – 20న విశాఖ జిల్లా – 23 – 24 – 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ శిబిరాలు జరుగుతాయి. స్పీకర్స్ (వక్త) – అనలిస్ట్ కంటెంట్ రైటర్స్ గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి 6000 – గ్రేటర్ హైదరాబాద్ నుంచి 4500 దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా జనసేన పరిపాలన కార్యాలయానికి అందాయి. అభ్యర్థులు అందరికీ పేరుపేరున శుభాభినందనలు తెలియచేస్తున్నాను. రాజకీయాల్లో ప్రతిభవంతులైన యువకులు – మేధావులను భాగస్వామ్యుల్ని చేయాలన్న నా తలంపునకు మీరు అందిస్తున్న సహకారం చాతి విలువయినదిగా భావిస్తున్నాను. శిబిరం సమయం – మిగిలిన వివరాలను ధరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారు.

janasenaparty.org/Srikakulam.pdf
janasenaparty.org/Visakha.pdf
janaSenaparty.org/hyd.pdf లేదా జనసేన ఫేస్ బుక్ పేజీ ద్వారా కూడ వివరాలు తెలుసుకోవచ్చు“ అని పవన్ పేరుతో జనసేన ప్రకటన విడుదల చేసింది.

జనసేన శిబిరాలు జరిగే ప్రాంతాలు ఇవి

శ్రీకాకుళం:
బాపూజీ కళామందిర్
2వ పోలీస్ స్టేషన్ ఎదురుగా
7వ రోడ్ జంక్షన్
శ్రీకాకుళం
532OO1

విశాఖ శ్రీ కృష్ణ విద్య మందిర్
తిలక్ షోరూం ఎదురుగా
BVK కాలేజీ దగ్గరలో ద్వారకా నగర్ . విశాఖపట్నం.

గ్రేటర్ హైదరాబాద్,
ఏఎంఆర్ గార్డెన్స్ దోల-రి-దాని ఎదురుగా,
కొంపల్లి, మేడ్చల్ రోడ్, సికింద్రాబాద్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news