Reviewsనాని, కీర్తి సురేష్‌ల ‘నేను లోకల్’ సినిమా రివ్యూ - రేటింగ్

నాని, కీర్తి సురేష్‌ల ‘నేను లోకల్’ సినిమా రివ్యూ – రేటింగ్

Exclusive review of Natural star Nani’s latest movie Nenu Local which is released on 03-02-2017. Keerthy Suresh played female lead and Trinadha Rao Nakkina directed this film under Dil Raju Production.

సినిమా : నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్, పోసాని కృష్ణమురళి, సచిన్ ఖేడకర్, తదితరులు
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
నిర్మాతలు : దిల్ రాజు
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ
రిలీజ్ డేట్ : 03-02-2017

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘నేను లోకల్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరుసగా ఐదు విజయాలు అందుకున్న తర్వాత నాని చేసిన ఆరో చిత్రం కావడంతో.. దీనిపై మొదటినుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్, ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో.. ఈ చిత్రంపై క్రేజ్ మరింత పెరిగింది. ఇక దిల్‌రాజు ఎప్పట్లాగే రిలీజ్‌కి ఒకరోజు ముందే స్పెషల్ షో వేయగా.. దానికీ క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇలా పాజిటివ్ రిపోర్ట్‌తో ఈరోజే రిలీజైన ఈ చిత్రం.. ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా? లేదా? రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ:
బాబు (నాని).. యాటిట్యూడే సర్వస్వంగా జీవితాన్ని సరదాగా గడిపే ఓ కాలేజ్ కుర్రాడు. ఇతడు అతికష్టం మీద బీటెక్ పాసై.. ఆ తర్వాత ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలో బాబుకి కీర్తి (కీర్తి సురేష్) కనిపిస్తుంది. మొదటిచూపులోనే ఆమె లవ్‌లో పడిపోతాడు. ఎలాగోలా ఆమెని కూడా తనను ప్రేమించేలా చేస్తాడు బాబు. కానీ.. కీర్తి తండ్రి (సచిన్ ఖేడ్కర్) మాత్రం వీళ్ల ప్రేమను ఒప్పుకోడు. సరిగ్గా ఇదే టైంలో బాబు ప్రేమకు మరో సమస్య ఎదురవుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దాన్ని బాబు ఎలా ఎదుర్కొన్నాడు? తమ ప్రేమను అంగీకరించని కీర్తి తండ్రిని ఒప్పించేలా బాబు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి కీర్తి తండ్రి ఒప్పుకుంటాడా? లేదా? అనే అంశాలతోనే ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
ఫస్టాఫ్ విషయానికొస్తే.. సరదా సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోతుంది. నాని, కీర్తి సురేష్‌ల మధ్య సాగే లవ్ స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. నాని కనిపించే ప్రతి సీన్ ఆహ్లాదకరంగా ఉంది. చాలావరకు సీన్లు రొటీన్‌గా అనిపించినా.. వాటిని ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కామెడీ సీన్స్ బాగా నవ్వించేస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది.

సెకండాఫ్ విషయానికొస్తే.. మొదట కాసేపు చాలా సాఫీగా గడిచిపోతుంది. కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్వించాయి. కాసేపయ్యాక సినిమా కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడ కాస్త బోర్‌గా అనిపిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ వరకు సినిమా అలాఇలా నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పుంజుకుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా.. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

ఓవరాల్‌గా చెప్పుకుంటే.. రొటీన్ సీన్లు ఉన్నప్పటికీ, బోర్ కొట్టకుండా ఫస్టాఫ్‌ని బాగానే తెరకెక్కించారు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మైండ్‌బ్లోయింగ్. కాకపోతే.. సెకండాఫే కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. మొదట బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ నవ్విస్తే.. ఇంకొన్ని బోర్ కొట్టించాయి. పైగా.. కథ కూడా పాతదే కావడం, ఎక్కడా కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్.

ఫస్టాఫ్‌లో ఉన్నంత సరదా, స్పీడ్ లేకపోవడం ఆడియెన్స్‌లో నిరుత్సాహం కలిగిస్తుంది. అక్కడక్కడ.. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ముందుగానే పసిగట్టేయొచ్చు. దాంతో.. కథనంలో పట్టు రొటీన్ అనే భావన కలుగుతుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఈ లోపాల్ని పట్టించుకోకపోతే.. సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటుల పనితీరు :
నాని ఎప్పటిలాగే తన నేచురల్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడు. ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ.. తాను అనుకున్నదే చేసే కుర్రాడి పాత్రలో నాని ఇరగదీసేశాడు. ఆ పాత్రలో నాని నటన కొత్తగా ఉంది. కీర్తి సురేష్ కూడా అతనికి పోటీగా అద్భుత అభినయంతో ఆకట్టుకుంది. అందంగా కనిపిస్తూనే.. మంచి నటనను ప్రదర్శించి.. సినిమాలో రొమాంటిక్ ఫీల్‌ని ఎక్కడా తగ్గకుండా చేసింది. నాని-కీర్తిల జంట చూడముచ్చటగా ఉంది. వీరిమధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీలకపాత్ర పోషించిన నవీన్ చంద్ర బాగానే నటించాడు. నాని తండ్రిగా పోసాని కృష్ణ మురళి, కీర్తి నాన్నగా సచిన్ ఖేడేకర్ తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి నటించారు.

సాంకేతిక పనితీరు :
నిజార్ షఫీ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన ప్రతి ఫ్రేమ్‌ని చాలా అందంగా, చూడచక్కగా చూపించాడు. దేవి శ్రీ అందించిన పాటలు ఎంటర్టైనింగ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి. దిల్ రాజు నిర్మణ విలువలకు ఎక్కడా వంక పెట్టలేం. ఇక త్రినాథరావు గురించి మాట్లాడితే.. ఆయన ఎంచుకున్న కథ పాతదే అయినా, దానికి కొత్తగా ఉండే హీరో క్యాటెక్టరైజేషన్, ఆడియెన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కొత్తగా ప్రెజెంట్ చేసి, ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో కాస్త జాగ్రత్త తీసుకుని ఉండుంటే బాగుండేది.

ఫైనల్ వర్డ్ : సరదాగా నవ్విస్తూనే.. ఎమోషనల్‌గా ఆకట్టుకున్న నాని
రేటింగ్ : 3.25/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news