Newsసమంత ‘నిశ్చితార్థం’ చీరలో దాగిన అద్భుతమైన ‘రహస్యాలు’

సమంత ‘నిశ్చితార్థం’ చీరలో దాగిన అద్భుతమైన ‘రహస్యాలు’

Do you know this, there are lot of secrets available in Samantha engagement saree which is really wonder. Read below article to know what are those.

హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి నాగచైతన్య-సమంతల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఎందరో అతిరథ మహారథులు విచ్చేసిన ఈ వేడుకలో సమంత కట్టుకున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే.. ఈ చీరలో అందరినీ అబ్బురపరిచే రహస్యాలు దాగి వున్నాయి.

సమంత చీర అంచును బాగా గమనిస్తే.. అందులో ‘ఏమాయ చేసావె’ చిత్రంలోని చై-శామ్‌ల ఓ సన్నివేశంతోపాటు బైక్‌పై వారివురు కలిసి వున్న చిత్రం కూడా కనిపిస్తుంది. అంతేకాదు.. అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. నిజంగా.. చాలా అద్భుతం కదూ. బంగారు వర్ణం అంచు కలిగిన ఈ తెలుపు చీరను ముంబయికి చెందిన డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చూడముచ్చటగా ఉన్న చై-శ్యామ్ జంట ఫోటోలపాటు చీర చిత్రం కూడా తెగ హల్‌చల్ చేస్తోంది. చీరలో ఆ దృశ్యాల్ని డిజైన్ చేసిన విధానం నిజంగా అమోఘం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Secrets-in-Samantha-Saree-1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news