Moviesతొలిసారి ఆ సాహసం చేస్తున్న చరణ్.. అంతా తండ్రి కోసమే!

తొలిసారి ఆ సాహసం చేస్తున్న చరణ్.. అంతా తండ్రి కోసమే!

Ram Charan has take a daring step as a producer for the first time. He is going to conduct a press meet to announce official collection details of his dad’s Chiranjeevi re-entry movie ‘Khaidi No 150’

ఓ సినిమాకి ఇన్ని కలెక్షన్లు వచ్చాయని, కొన్ని రికార్డులు బ్రేక్ చేసిందని తరచూ వార్తలు వింటూ వుంటాం.. కానీ ఆ వివరాల్ని నేరుగా నిర్మాతలు ప్రకటించిన సందర్భాలైతే లేవు. అభిమానులను ఉత్సాహ పరచడం కోసం నోటి లెక్కలు చెప్తారే తప్ప.. కరెక్ట్ అమౌంట్‌ని వెల్లడించరు. ఇందుకు కారణం.. ఇన్‌కమ్ ట్యాక్స్ పరంగా ఏవైనా ఇబ్బందులు వస్తాయన్న భయం. ఆ కారణంగానే అఫీషియల్‌గా కలెక్షన్స్ బ్రేకప్ ఇవ్వడానికి నిర్మాతలు జంకుతారు. కానీ.. ఇతర నిర్మతల్లా కాకుండా రామ్ చరణ్ తొలిసారి ఓ డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. తన తండ్రి 150వ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాల్ని అధికారికంగా వెల్లడించేందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు.

దాదాపు దశాబ్దకాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 150వ సినిమా‘ఖైదీ నెం.150’కి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. భారీ కలెక్షన్లు సాధించి, సరికొత్త సంచలనాలే క్రియేట్ చేసింది. దీంతో.. తన తండ్రి సృష్టించిన సంచనాల్ని అధికారికంగా వెల్లడించాలని భావించి, ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. చాలాకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తన తండ్రి.. వచ్చి రావడంతోనే ప్రకంపనలు సృష్టించి, తన స్థానాన్ని తిరిగి చేసుకున్న ఘనతను అఫీషియల్‌గా వెల్లడించడంలోనే ఆనందం ఉందని ఫీలవుతున్నాడు. తండ్రి సృష్టించిన సంచలనం ముందు టాక్స్‌ పరమైన ఇబ్బందులేం లెక్క కాదని చరణ్‌ ఈ ప్రెస్‌మీట్ ద్వారా నిరూపించబోతున్నాడు. చరణ్ తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news