Moviesకుమ్ముడు కన్నా ‘పక్కా లోకల్’కే ఓటు వేసిన కాజల్

కుమ్ముడు కన్నా ‘పక్కా లోకల్’కే ఓటు వేసిన కాజల్

Kajal Agarwal votes Pakka Local song than Ammadu let’s do kummudu which shocks every one. Read below article to know why she choose that.

ఎంత స్టార్‌డమ్ ఉన్నా.. ఏ స్టార్ హీరోతో నటించినా సరే.. తమ కెరీర్‌ని మలుపుతిప్పిన అంశం గురించే నటీనటులు ప్రస్తావిస్తారు. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఆ జపమే చేస్తోంది. తన హవా నడుస్తున్నంతకాలం వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ అమ్మడికి గతేడాది పెద్ద గండమే వచ్చి పడింది. వరుసగా రెండు డిజాస్టర్లు (సర్దార్, బ్రహ్మోత్సవం) చవిచూడడంతో.. ఆమె కెరీర్ గాడిలో పడిపోయే పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు ఎలాగోలా తన క్రేజ్‌ సంపాదించుకోవాలని కాజల్ ప్రయత్నిస్తున్న తరుణంలో.. ‘పక్కా లోకల్’ సాంగ్ ఆఫర్ వచ్చిపడింది. దాంతో.. అది ఐటమ్ సాంగ్ అని పట్టించుకోకుండా, తన స్థాయిని మరిచిపోయి వెంటనే ఒప్పేసుకుంది. ఇప్పుడదే ఈమెకి తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. అందుకే.. ఆ పాటను తన కెరీర్‌లోనే ప్రత్యేకంగా భావిస్తోంది కాజల్. మెగాస్టార్ చిరంజీవి సరసన చేసిన ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ కంటే.. ఆ పాట తనకు ఎక్కువ ఇష్టమనడం చాలా ఆశ్చర్యకరం. నిజానికి చిరు సరసన నటించే అవకాశం దొరకడం తన అదృష్టమని, అది మరుపురాని అనుభవం అని పేర్కొన్న ఈ భామ.. ఆయనతో చేసిన ‘లెట్స్ డు కుమ్ముడు’కంటే పక్కా లోకల్ పాటే చాలా స్పెషల్ అని చెప్పింది.

అయినా.. కాజల్ అలా చెప్పడంలో కూడా న్యాయం ఉందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే.. ‘లెట్స్ డు కుమ్ముడు’ పాటలో కాజల్ పాత్ర నామమాత్రమే. అందులో చిరునే హైలైట్ అయ్యాడు. అలాగే.. చరణ్ కూడా మధ్యలో వచ్చి కొంచెం క్రెడిట్ తీసుకున్నాడు. అదే పక్కా లోకల్ పాట విషయానికొస్తే.. అందులో కాజలే హైలైట్ అయ్యింది. తన అందాలు ఆరబోయడంతోపాటు డ్యాన్స్‌తో ఇరగదీసేసి.. ఎన్టీఆర్‌లాంటి హీరోని సైతం కనిపించకుండా చేసింది. అందుకే.. తాను హైలైట్ అయిన ఈ పాటకే కాజల్ ఓటేసిందని చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news