Movies‘శాతకర్ణి’ ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఏరియాల వారీగా వివరాలు

‘శాతకర్ణి’ ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ఏరియాల వారీగా వివరాలు

Balayya’s 100th film Gautamiputra Satakarni worldwide first day collections report is out.

చారిత్రాత్మక సినిమాలకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ఆ తరహా చిత్రాల్లో భారీతనం నిండి వుంటుంది. అంటే.. పెద్దపెద్ద భవంతులు, కళ్లుచెదిరే లొకేషన్స్, భారీ యుద్ధ సన్నివేశాలు అన్ని ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే.. అలాంటి సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా హిస్టారికల్ మూవీనే కావడంతో.. దానికి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలయ్యకు అంతగా మార్కెట్ లేని ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ‘శాతకర్ణి’ సినిమా తొలిరోజు రూ.18.35 కోట్లు గ్రాస్, రూ.12.75 కోట్లు షేర్ రాబట్టింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. చిరు కంబ్యాక్ మూవీ పోటీగా ఉన్నప్పటికీ.. దాన్ని ఎదుర్కొని ఈ రేంజ్ వసూళ్లు కలెక్ట్ చేయడం విశేషమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈ మూవీకి అన్నివైపుల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. మరిన్ని రికార్డులు సృష్టించవచ్చునని భావిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..

నైజాం : 1.88
సీడెడ్ : 2.07
నెల్లూరు : 0.43
కృష్ణా : 0.80
గుంటూరు : 1.64
వైజాగ్ : 0.88
ఈస్ట్ గోదావరి : 0.78
వెస్ట్ గోదావరి : 1.34
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 9.82 కోట్లు
కర్ణాటక : 0.70
యూఎస్ఏ : 1.73
రెస్ట్ : 0.50
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : రూ.12.75 కోట్లు
గ్రాస్ : రూ. 18.35 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news