Movies‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్.. బాలయ్య కెరీర్‌లో రికార్డ్

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్.. బాలయ్య కెరీర్‌లో రికార్డ్

Balakrishna’s 100th project Gautamiputra Satakarni US Premieres collections are out and it is record figure in both Balayya and Krish career.

భారీ అంచనాల మధ్య విడుదలైన బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. బాలయ్యకు అంతంత మాత్రమే మార్కెట్ ఉన్న యూఎస్‌లో ఈ చిత్రం.. ఆయన కెరీర్‌లోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారా 117 లొకేషన్స్ నుంచి $362,820 (రూ. 2.47 కోట్లు) గ్రాస్ రాబట్టింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే కాదు, క్రిష్ కెరీర్‌లోనూ రికార్డ్ ఫిగరే. క్రీ.శ. 1-2 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కడం, క్రిష్‌లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ అతి తక్కువ టైంలోనే షూటింగ్ కంప్లీట్ చేయడం, బాలయ్య 100వ చిత్రం కావడం వంటివి ఎనలేని క్రేజ్‌ని తెచ్చిపెట్టడంతో.. యూఎస్‌లో ఈ రేంజ్ వసూళ్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఈ చిత్రానికి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ వీకెండ్‌లోనే ఇది 1 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఓ హిస్టారికల్ చిత్రంలో ఏ అంశాలైతే కోరుకుంటారో ఆ హంగులతో ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించిన విధానానికి, బాలయ్య ‘శాతకర్ణి’ పాత్రలో కనబరిచిన వీరోచిత నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news