Moviesతెలుగు సినీ చరిత్రలో ‘ఒకేఒక్కడు’ బాలయ్య

తెలుగు సినీ చరిత్రలో ‘ఒకేఒక్కడు’ బాలయ్య

Nandamuri Balayya create history with his historical movie Gautamiputra Satakarni even in huge competition with Chiranjeevi’s 150 project Khaidi No 150.

ఓ చారిత్రాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. చరిత్ర సృష్టించడం ఖాయమని ఎప్పటినుంచో అంచనాలున్నాయి. అనుకున్నట్లుగానే ఆయన హిస్టరీ క్రియేట్ చేశాడు. తెలుగులో ఇంతవరకు ఏ ఒక్క స్టార్ హీరో సాధించని అరుదైన ఘనతని సాధించి.. ఒకేఒక్కడుగా నిలిచాడు. అదేంటో తెలిస్తే కేవలం నందమూరి ఫ్యాన్సే కాదు.. ఓ మంచి సినిమాతో ఈ రికార్డ్ సాధించినందుకు యావత్ తెలుగు ఆడియెన్స్ గర్వంగా ఫీల్ అవుతారు. ఇంతటి ఆ ఘనత ఏంటనుకుంటున్నారా! అయితే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

ఈ సంక్రాంతి కానుకగా చిరంజీవి తన 150వ చిత్రంతో బాలయ్య సినిమాకంటే ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో ‘ఖైదీ నెం.150’పై తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో.. ఆ చిత్రం తొలిరోజు గత రికార్డులను తుడిచిపెట్టేసేలా భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి’ రికార్డ్‌ని బ్రేక్ చేసి, వరల్డ్‌వైడ్‌గా ‘నాన్-బాహుబలి’ రికార్డ్‌ని సొంతం చేసుకుంది. ఇలాంటి చిత్రానికి పోటీగా బాలయ్య బరిలోకి దిగడం, అదికూడా హిస్టారికల్ సబ్జెట్‌తో రావడం వల్ల.. ‘శాతకర్ణి’ సినిమా తొలిరోజు ఎంత కలెక్ట్ చేస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ‘ఖైదీ’కి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో.. దాని ప్రభావం బాలయ్య సినిమాపై ఖచ్చితంగా ఉంటుందని, ఆ దెబ్బకి ‘శాతకర్ణి’కి తక్కువ వసూళ్లే వస్తాయని అనుకున్నారు.

కానీ.. అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ ‘శాతకర్ణి’ సినిమా తొలిరోజు రూ.12.75 కోట్లు కొల్లగొట్టింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. విపరీతమైన క్రేజ్‌తో రిలీజైన చిరు కంబ్యాక్ మూవీ పోటీగా ఉన్నప్పటికీ.. ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. నిజానికి.. ఇలాంటి భారీ పోటీలో మొదటిరోజున అంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమా టాలీవుడ్‌లో ఏ ఒక్కటి లేదు. అవును.. గతంలో ఇలాగే సినిమాలు పోటీగా రిలీజవ్వగా, ఒకరోజు తర్వాత వచ్చిన మూవీలు రూ.10 కోట్ల మార్క్‌ని దాటలేదు. కానీ.. బాలయ్య తొలిసారి తన 100వ చిత్రంతో ఆ ఫీట్‌ని అందుకున్నాడు. దీంతో.. ఈ రేర్ రికార్డ్ సాధించిన ఒకేఒక్క తెలుగు హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించాడు. కాగా.. ఇద్దరు సీనియర్ హీరోలు ఒకేసారి తమ సినిమాల్ని రిలీజ్ చేసి, ఘనవిజయం సాధించడం.. టాలీవుడ్‌కి మంచి పరిణామం. ఈ సంక్రాంతి తెలుగు ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news