Moviesధృవలో ఆ ‘8’కి అర్థం ఏంటో తెలుసా..?

ధృవలో ఆ ‘8’కి అర్థం ఏంటో తెలుసా..?

Director Surender Reddy increases more curiosity on Dhruva movie by not revealing the secret behind 8 number which is on title, and also denies rumours. He told that, according to story there is connection with 8 in the film. You will be know that after watching movie.

తమ చిత్రంపై అంచనాలు పెంచుకోవడం కోసం దర్శకనిర్మాతలు ఈమధ్య చాలా ట్రిక్స్ పాటిస్తున్నారు. టైటిల్ కార్డ్‌ నుంచే ఆసక్తి పెరిగేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టైటిల్‌లోనే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ దాచేసి.. దాని వెనకాల ఉన్న అసలు సీక్రెట్ ఏంటో సినిమా చూసి తెలుసుకోండంటూ మైండ్ గేమ్స్ ప్రదర్శిస్తున్నారు. ఇందుకు ‘ధృవ’ యూనిట్ కూడా మినహాయింపు కాదు. ఈ చిత్రబృందం కూడా ‘ధృవ’ టైటిల్ వెనకాల ‘8’ అనే అంకెను జోడించి.. అసలు అది ఎందుకు జోడించారన్న ఆలోచనలో ఆడియెన్స్‌ని పడేసింది. టైటిల్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి అందరికీ అదే సందేహం.

దానిపై ఎలాగైనా క్లారిటీ తీసుకోవాలని భావించి.. కొందరు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ అంకె వెనుక సీక్రెట్ ఇదేనని ఒకటి వెలుగులోకి వచ్చింది. సురేందర్ రెడ్డి కెరీర్‌లో ఇది ఎనిమదో చిత్రం కాబట్టి.. అది చెప్పడానికి టైటిల్ వెనుక మనోడు 8 అంకెను పెట్టుకున్నాడంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. మరి.. అందులో ఎంతవరకు నిజముందోనని నేరుగా సురేందర్‌నే అడగ్గా.. మనోడు టాప్ లేచిపోయే రేంజులో స్పందించాడు. ‘ఏవండీ.. రామ్‌చరణ్ ఏమైనా ఒక చిన్న హీరోనా? నా ఇష్టం వచ్చినట్లు టైటిల్ వెనకాల అంకెలను పెట్టుకోవడానికి? స్టోరీకి సంబంధించి ఒక ముఖ్యమైన కనెక్షన్ ఉండడం వల్లే లోగోలో 8 అనే నెంబర్‌ను పెట్టాం. సినిమా చూశాక అదేంటో మీకే అర్థం అవుతుంది’ అంటూ సురేందర్ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news