Newsరాత్రిపూట తనని కౌగలించుకోనిదే.. నిద్రపోనంటున్న రెజీనా

రాత్రిపూట తనని కౌగలించుకోనిదే.. నిద్రపోనంటున్న రెజీనా

Normally actresses feels shy to share anything personal of their infront of media. But Regina Cassandra is quite opposite to all of them. She shares everything without any hesitations. In the recent interview she also shares her bedroom secret. Read below story to know about that.

హీరోయిన్లు తమ పర్సనల్ విషయాలు పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే.. మీడియా ముందు హాట్ కామెంట్లు చచ్చినా చేయరు. అలా మాట్లాడితే.. తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో పద్ధతిగా నడుచుకుంటారు. కానీ.. రెజీనా మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ అమ్మడు సినిమాల్లో ఎంత సహజంగా నటిస్తుందో.. మీడియాముందు కూడా అంతే ఓపెన్‌గా ఉంటుంది. మొహమాటం లేకుండా ప్రతి ప్రశ్నకీ జవాబిచ్చేస్తుంది. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడంలోనూ, హాట్ కామెంట్ చేయడంలోనూ ఈమె దిట్ట. ఇప్పుడు మరోసారి అలాంటి మాటలతోనే ఈ అమ్మడు వార్తల్లోకెక్కింది. తనమీద వస్తున్న లవ్ ఎఫైర్ రూమర్లను కొట్టిపారేస్తూనే.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది.

‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాపై వస్తున్న పుకార్ల విషయంలో నేను ఒక్కటే నమ్ముతాను.. ఒకే సమాధానమిస్తాను. తెలిసీ తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడేవాళ్లు ‘మీరు చూసింది నమ్మండి.. విన్నది కాదు’ అంటూ తనమీద వస్తున్న రూమర్లను కొట్టిపారేసింది. ఇక సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ.. ‘ఆ సీన్లలో నటించేంత కష్టం మరొకటి ఉండదు. నటనలో నాకు అనుభవం బాగానే పెరుగుతోంది కానీ.. రొమాంటిక్ సీన్లు చెయ్యడానికే ఇప్పటికీ తడబడుతుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సన్నివేశాల్ని చెడగొట్టడంలో నా తర్వాతే ఎవరైనా అనుకుంటాను’ అని చెప్పుకొచ్చింది. ఆన్‌స్ర్కీన్స్ రొమాన్స్ అంటే కాస్త భయమేనని అంటున్న ఈ అమ్మడు.. బెడ్ మీద చాలా రొమాంటిక్‌గా ఉంటానని చెప్పకనే చెప్పేసింది.

బొమ్మలు, పువ్వులు అంటే అస్సలు ఇష్టం లేదంటున్న ఈ చెన్నై బ్యూటీ.. తలదిండు అంటే చాలా ఇష్టమని అంటోంది. ‘నాకు పిల్లో అంటే చాలా ఇష్టం.. నిద్రపోయే సమయంలో అది నా పక్కనే ఉండాలి.. దానిని కౌగిలించుకుని పడుకోవడమంటే ఇంకా ఇష్టం.. దాన్ని కౌగలించుకోనిదే నేను నిద్రపోను.. ప్రతిరోజు తలదిండు నా కౌగిలిలో నలిగిపోవాల్సిందే’ అని రెజీనా పేర్కొంది. భవిష్యత్తులో ఆ దిండు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news