Moviesఆ టార్గెట్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన ‘ధృవ’.. ఈసారైనా వర్కౌట్...

ఆ టార్గెట్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన ‘ధృవ’.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా?

Ram Charan Tej has created his own image in Tollywood, but still struggling to reach one target from his career start. So, now he is making a master plan to reach that goal with his latest film Dhruva. Let’s see he will reach or not.

మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘చిరుత’లా ఎంట్రీ ఇచ్చి.. రెండో చిత్రంతోనే నిజమైన ‘మగధీరు’డని అనిపించుకున్నాడు. ఆ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ వరుస విజయాలు అందుకున్నాడు. గత రెండు చిత్రాలు మినహా.. ఇతని కెరీర్‌లో అన్నీ సక్సెస్‌లే. అంతా బాగానే ఉంది కానీ.. చరణ్ ఇంతవరకు ఒకే ఒక్క టార్గెట్‌ని అందుకోలేకపోతున్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన చిన్న హీరోలు సైతం ఆ టార్గెట్‌ని సునాయాసంగా చేరుకుంటుంటే.. చెర్రీ మాత్రం కనీసం టచ్ చేయలేకపోతున్నాడు. అదేమిటనుకుంటున్నారా? మరేదో కాదు.. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేయడం.

టాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసే ఈ హీరో.. యూఎస్‌లో మాత్రం చతికిలపడిపోతున్నాడు. ఎంతోకాలం నుంచి మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరేందుకు కష్టపడుతున్నాడు కానీ.. వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ఎలాగైనా తన ‘ధృవ’ చిత్రంతో ఆ టార్గెట్‌ రీచ్ అవ్వాలనుకుని.. ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అందులో భాగంగా.. ప్రీమియర్స్‌కి ఒకరోజు ముందు యూఎస్‌కి వెళ్ళి, తన చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేయాలని స్కెచ్ గీశాడు. అంతేకాదు.. వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని పక్కా స్కెచ్ వేయగా.. అది కూడా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీని అక్కడ ఏకంగా 202 స్ర్కీన్స్‌లో ప్రదర్శించబోతున్నారు. యూఎస్‌లో 200లకు పైగా స్క్రీన్స్‌లో ఓ తెలుగు మూవీకి ప్రీమియర్స్ పడడం ఇదే మొదటిసారి.

ఇంత భారీఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడాన్ని చూస్తుంటే.. చరణ్ ఈసారి మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ స్టైలిష్ కాప్ డ్రామాపై యూఎస్‌లో మంచి క్రేజ్ ఉంది. అక్కడి ఆడియెన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకే బ్రహ్మరథం పడతారు కాబట్టి.. అదే కేటగిరీకి చెందిన ‘ధృవ’కి కూడా ఆదరణ లభిస్తుందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మరి.. ఈసారైనా చరణ్ ‘ధృవ’తో అక్కడి ఆడియెన్స్‌ని అలరించి, మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరుతాడా? లేదా? వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news