Newsఎన్టీఆర్ ఒక..... సీక్రెట్స్‌ను రివీల్ చేసిన హీరో శ్రీకాంత్!

ఎన్టీఆర్ ఒక….. సీక్రెట్స్‌ను రివీల్ చేసిన హీరో శ్రీకాంత్!

Telugu Hero Srikanth has revealed some interesting and shocking news about NTR. He said that NTR used to kidnap before he stepped into the industry.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 17 ఏళ్ళ సినీ కెరీర్‌‌లో ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నాడు. స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు తారక్ మంచి రిలేషన్స్ మెయిన్‌టేన్ చేస్తుంటాడు. అయితే ఎన్టీఆర్ గతం గురించి ఓ పిడుగులాంటి వార్త చెప్పాడు ఓ స్టార్ హీరో. ఈ విషయం విన్న తారక్ ఫ్యాన్స్‌కు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఆ హీరో ఎవరో తెలుసుకొని తాడో పేడో తేల్చేయానుకున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న హ్యాండ్‌సమ్ హీరో శ్రీకాంత్.

అవును.. ఇది నిజం. హీరో శ్రీకాంత్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గతంలో కిడ్నాప్‌లు చేసేవాడంటూ టాలీవుడ్‌కే దిమ్మతిరిగే విషయం చెప్పుకొచ్చాడు. దీంతో ఖంగుతిన్నాడు ఆ రిపోర్టర్. ఇక అసలు విషయం తెలిసిన తరువాత తనలో తానే నవ్వుకున్నాడు. గతంలో హీరో శ్రీకాంత్, ఎన్టీఆర్ కుటుంబాలు పక్క పక్కన ఇళ్లలో ఉండేవారట. అప్పుడు రోషన్ చాలా చిన్నవాడు కావడం వలన తారక్‌కు అతడంటే చాలా ఇష్టమని చెప్పారు శ్రీకాంత్. ఎప్పుడూ రోషన్‌ను ఆడించే ఎన్టీఆర్.. కొన్ని సార్లు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రోషన్‌ను వాళ్ల ఇంటికీ తీసుకెళ్లే వాడట. రోషన్ కనబడకపోయే సరికి ఇంట్లోని వారు ఆందోళన చెందుతున్నప్పుడు ఫోన్ చేసి రోషన్‌ను తానే తీసుకుపోయానని చెప్పేవాడట తారక్.

ఇలా తమ కొడుకును ఎన్టీఆర్ అనేక సార్లు కిడ్నాప్ చేశాడని చెబుతున్నాడు శ్రీకాంత్. ఇక తారక్‌తో తనకు ఉన్న రిలేషన్ గురించి కూడా శ్రీకాంత్ ఈ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో తారక్‌ను రీప్లేస్ చేయగల హీరో మరెవరూ లేరంటూ కితాబు ఇచ్చాడు శ్రీకాంత్. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చ్‌ల్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news