Movies‘ధృవ’ రెండురోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. షాకింగ్ రిపోర్ట్

‘ధృవ’ రెండురోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. షాకింగ్ రిపోర్ట్

భారీ అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాలకు ఆ క్రేజ్ కారణంగా సహజంగానే తొలిరోజు మంచి వసూళ్లు వస్తాయి. ఒకవేళ దానికి పాజిటివ్ టాక్ వస్తే.. రెండోరోజు అంతకుమించి కలెక్షన్లు రాబడుతాయి. కానీ.. ‘ధృవ’ విషయంలో అది రివర్స్ అయ్యింది. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.59 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కేవలం రూ.4.87 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఫస్ట్ డే అన్నిచోట్లా హిట్ టాక్ వచ్చినా.. ఆ తర్వాతి రోజే వసూళ్లు డ్రాప్ అవ్వడంతో ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఈ మూవీలో కామెడీ, మాస్ మసాలా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల మాస్ ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయారని, అందుకే వసూళ్లు తగ్గి వుంటాయని భావిస్తున్నారు. అలాగే.. డీమోనిటైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉందని పేర్కొంటున్నారు.

అదే యూఎస్ఏ, కర్ణాటక ఏరియాల విషయానికొస్తే.. తొలిరోజుతో పోల్చుకుంటే రెండోరోజు వసూళ్లు పెరిగాయి. ప్రీమియర్స్ ద్వారా 2.23 లక్షల డాలర్లు రాబట్టిన ‘ధృవ’.. శుక్రవారం 2.44 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక శనివారం కూడా ఆ రేంజ్ వసూళ్లే రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే చరణ్ తన ‘డ్రీమ్’ మిలియన్ మార్క్‌ని అందుకోబోతున్నాడని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నారు. కర్ణాటకలో కూడా కలెక్షన్లు రెండోరోజు పెరిగినట్లు డిస్ట్రిబ్యూటర్స్ తెలిపారు. ఇక మిగిలిన ఏరియాల్లోనూ ‘ధృవ’ ప్రభంజనం సృష్టిస్తున్నాడని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి.. రెండు వరుస ఫ్లాపుల తర్వాత చరణ్ ఎనర్జిటిక్‌గా రీఎంట్రీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు.

ఏరియాల వారీగా రెండురోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 5.20
సీడెడ్ : 2.92
నెల్లూరు : 0.55
కృష్ణా : 1.03
గుంటూరు : 1.43
వైజాగ్ : 1.95
ఈస్ట్ గోదావరి : 1.20
వెస్ట్ గోదావరి : 1.18
ఏపీ+తెలంగాణ : రూ. 15.46 కోట్లు
కర్ణాటక : 4.00
యూఎస్ఏ : 3.50
రెస్టాఫ్ ఇండియా+వరల్డ్ : 1.20

టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 24.16 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news