సాహూ నుండి కాజోల్ కి ఆఫర్ వచ్చిందా..?

29

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ సాహో నామస్మరణ చేస్తున్నారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్ల‌ర్ థియేటర్లలోకి దిగేందుకు ఒక రోజు సమయం మాత్రమే ఉంది. ఈ నెల 30న సాహో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో శ్రీలంక ముద్దుగుమ్మ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్ర‌భాస్‌తో ఆడి పాడిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సాంగ్ లో నటించేందుకు ఆమెకు మేక‌ర్స్ కోటి రూపాయల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.

అయితే ఈ సాంగ్ లో నటించేందుకు ముందుగా కాజల్ ను సంప్రదించారట. కాజల్ రెండు వారాల డేట్లు అడిగినందుకు ఏకంగా గా రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో… చిత్రయూనిట్ సభ్యులు ఆమె కంటే నేషనల్ క్రేజ్ ఉన్న జాక్విలిన్ అయితేనే కరెక్ట్ అని భావించి ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ కు ఛాన్సులు ఇచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదు. బెల్లంకొండ లాంటి మీడియం రేంజ్‌ హీరోలు కవచం, సీత లాంటి సినిమాల‌లో ఆమెను వ‌రుస‌గా బుక్ చేసుకుంటున్నారు.

అంత‌కు మించి సీనియ‌ర్ హీరోలు, స్టార్ హీరోలు ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇలాంటి టైం లో నేషనల్ క్రేజ్ ఉన్న సినిమాలో ఛాన్స్ వస్తే… కేవలం డబ్బులు చూసుకుని బంపర్ ఛాన్స్ మిస్ చేసుకోవటం ఆమె అహానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సాహోలో ఐటమ్ సాంగ్ చేసి ఉంటే ఒక గొప్ప సినిమాలో నటించిన అనుభూతి ఆమెకు ఎప్పటికి మిగిలి ఉండేది. బంగారంలాంటి ఛాన్స్ కాజల్ చేజేతులా మిస్ చేసుకుంది.

Leave a comment