మహేష్ ఎవరిని వదలట్లేదు..

70

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కేవలం ఒక హీరోయిన్ ఉంటే ఎలా అనుకున్నారో ఏమో మరో హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ స్పెషల్ గా ఉండబోతుందట.

ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే ముందు మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సాంగ్ చేస్తుందని అన్నారు. అయితే తమన్నా కన్నా పూజా హెగ్దె అయితే బెటర్ అని అనుకుంటున్నారట. ప్రస్తుతం వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న పూజా హెగ్దె మహర్షి సినిమాలో మహేష్ సరసన నటించింది. అదే ప్రొడక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి మహేష్ సరిలేరు లో స్పెషల్ సాంగ్ కోసం పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.

రంగస్థలంలో జిగేలు రాణి అంటూ రచ్చ చేసిన పూజా హెగ్దె ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క స్పెషల్ సాంగ్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతుంది. ప్రస్తుతం పూజా హెగ్దె అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, ప్రభాస్ జాన్ (వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి.

Leave a comment