Moviesఅమెరికాలో తన జెండా పాతడానికి సిద్ధంగా ఉన్న మెగాస్టార్ !!

అమెరికాలో తన జెండా పాతడానికి సిద్ధంగా ఉన్న మెగాస్టార్ !!

అమెరికాలో జెండా పాతడమేమిటి అనుకుంటున్నారా? అవును కేవలం 5 రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరబోతున్నాడు మన మెగాస్టార్!
60 ఏళ్ల వయసులోనూ చిరంజీవి తనకు మాత్రమే సాధ్యమైన స్టెప్పులతో.. టైమింగ్ తో అమెరికన్ ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేస్తున్నాడు. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు అంటే చిరంజీవి కోసం ఎంతగా తపిస్తున్నారో అర్థం అవుతుంది.

శుక్రవారం $ 139,547 వసూళ్లు సాధించిన ఖైదీ శనివారం అనూహ్యంగా $ 252,513 కలెక్షన్లు సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు మొత్తం 1,923,764 [₹ 13.11 cr] డాలర్ల కలెక్షన్లు సాధించి 2 మిలియన్ కి కూతవేటు దూరంలో ఉన్న చిరంజీవి ఇంకా ఎన్ని రికార్డులని తిరగరాయనుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news