Newsతెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ‘శాతకర్ణి’

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ‘శాతకర్ణి’

Telangana CM KCR ahead to Prasad’s IMAX to watch Nandamuri Balakrishna’s 100th film Gautamiputra Satakarni. CM will watch the film along with Satakarni team including Nandamuri Balakrishna.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్.. అప్పట్లో ఈ సినిమాని తాను మొదటి బ్యాచ్‌తో కలిసి చూస్తానని బాలయ్యని కోరారు. ఒక శకానికి నాంది పలికిన ‘శాతకర్ణి’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగువారికి చిరకాలంగా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని.. ఈ చిత్రం తానుకూడా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. అందుకు బాలయ్య సరేనని, ఖచ్చితంగా సినిమాని చూపిస్తానని మాటిచ్చారు. ఆ మాటని నిలబెట్టుకున్నారు.

తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేసీఆర్‌కి చూపించేందుకు బాలయ్యతోపాటు క్రిష్ టీం ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళ్ళారు. ఈ నేపథ్యంలో.. అక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడం, ఇప్పుడు కేసీఆర్ కూడా వీక్షిస్తుండడంతో.. ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news