Bhaktiశ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లో 'కౌసల్య సుప్రజ రామా' అంటూ శ్రీరాముని...

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం లో ‘కౌసల్య సుప్రజ రామా’ అంటూ శ్రీరాముని గురించి ఎందుకు వస్తుంది?

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం ‘కౌసల్య సుప్రజరామ’ వాల్మీకి రామాయణ శ్లోకం.తన యాగ సంరక్షణ నిమిత్తం శ్రీరాముడిని వెంటతెచ్చుకున్న విశ్వామిత్రమహర్షి ఆయనను నిద్ర మేల్కొలిపిన సందర్భం లోనిది ఈ శ్లోకం.ఇక వెంకటేశ్వర సుప్రభాతంలోని రెండో శ్లోకం ‘ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద’ అంటూ శ్రీకృష్ణుని మేల్కొలుపుతుంది. 24 వ శ్లోకం ‘మీనాకృతే’ దశావతార స్వరూపుడైన శ్రీ వెంకటాచలపతిని మేల్కొలుపుతుంది. శ్రీ వేంకటేశ్వరుడే మహావిష్ణువు అని అర్ధం. ఆ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాల సమాహారం స్వరూపుడు శ్రీవెంకటేశ్వరుడు.

శ్రీ వాల్మీకి రామాయణoలోని మొదటి శ్లోకం ‘మానిషాద ప్రతిష్ఠాoత్వ’ లో శ్రీరాముడే శ్రీనివాసుడిగా పెద్దలు నిరూపించారు. తిరుమల కలియుగ వైకుంఠం. తిరుమల వాసుడైన శ్రీనివాసుడు సాక్షాత్తూ వైకుంఠవాస శ్రీమన్నారాయణుడే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news