Movies‘శతమానం భవతి’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.. మహా మహులకే షాక్!!

‘శతమానం భవతి’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్.. మహా మహులకే షాక్!!

Shatamanam Bhavati movie first day collections report is out and it is really outstanding figure even in huge competition at the telugu states boxoffice.

సంక్రాంతి కానుకగా ఆల్రెడీ టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలయ్యల ప్రతిష్టాత్మక 150, 100వ చిత్రాలు ‘ఖైదీ నెం.150’, ‘శాతకర్ణి’ ఒకరోజు గ్యాప్‌తో వరుసగా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యాయి.. వాటికి రిపోర్ట్‌లు కూడా అన్నివైపుల నుంచి పాజిటివ్‌గానే రావడంతో బాక్సాఫీస్‌ని దున్నేస్తున్నాయి.. ఇలాంటి టైంలో రిలీజైన ‘శతమానం భవతి’ సినిమా పరిస్థితి ఏంటా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ రెండు సినిమాల సునామీ ముందు ఈ చిత్రం కొట్టుకుపోవచ్చునని అంతా భావించారు. కానీ.. అందరి ఊహాగానాల్ని ఆ సినిమా పటాపంచలు చేసింది. బాక్సాఫీస్ వద్ద అసలైన ప్రభంజనం ఏంటో తన సత్తా చాటి చూపింది. పెద్ద సినిమాల పోటీ నడుమ కూడా.. భారీ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తొలిరోజు ‘శతమానం భవతి’ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.3.05 కోట్లు (షేర్) కొల్లగొట్టింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ చిత్రంలో ఏ స్టార్ హీరో లేడు.. దర్శకుడికి కూడా పెద్దగా గుర్తింపు లేదు.. అయినా ‘ఖైదీ’, ‘శాతకర్ణి’లాంటి సినిమాలకు పోటీగా బరిలోకి అన్ని కోట్లు రాబట్టడం విశేషం. పైగా.. ఇది శర్వానంద్ కెరీర్‌లో రికార్డ్ ఫిగర్. రిలీజ్‌కి ముందే ఈ చిత్రానికి విపరీతమైన పాజిటివ్ టాక్ వుండడం, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ కావడం వల్లే ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారని, అందుకే భారీ పోటీలోనూ అనూహ్య వసూళ్లు కలెక్ట్ చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 1.05
సీడెడ్ : 0.35
నెల్లూరు : 0.09
కృష్ణా : 0.16
గుంటూరు : 0.24
వైజాగ్ : 0.46
ఈస్ట్ గోదావరి : 0.39
వెస్ట్ గోదావరి : 0.31
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 3.05 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news