Moviesఖైదీ, శాతకర్ణిల పోటీమధ్య అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘శతమానం భవతి’

ఖైదీ, శాతకర్ణిల పోటీమధ్య అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘శతమానం భవతి’

Shatamanam Bhavathi enters in half million club within 5 days.

ఒకరిది కంబ్యాక్ మూవీ.. మరొకరిది చారిత్రక నేపథ్యమున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం.. ఈ రెండింటి మీద సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ నెలకొంది. విడుదలకు దగ్గరపడుతున్నకొద్దీ మరిన్ని అంచనాలు పెంచుకుంటూ వచ్చిన ఆ సినిమాలు.. చివరికి వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యాయి. రెండూ పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుని.. బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకుంటున్నాయి. అలాంటి సమయంలో ‘శతమానం భవతి’ సినిమా రిలీజ్ అవ్వగా.. వాటి సునామీ ముందు ఇది కొట్టుకుపోతుందని అంతా భావించారు. కానీ.. ఆ ఊహాగానాల్ని తలక్రిందులు చేస్తూ ఆ చిన్న సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోంది. ఇప్పుడు ఏకంగా ఓ అరుదైన రికార్డ్ సృష్టించింది.

ఓవర్సీస్‌లో చిరు, బాలయ్యల సినిమాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వాటికి ధీటుగా ‘శతమానం భవతి’ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు సంపాదిస్తోంది. ప్రీమియర్స్ దగ్గర నుంచి స్టడీ కలెక్షన్స్ వసూలు చేస్తున్న ఈ సినిమా.. మంగళవారంతో హాఫ్ మిలియన్ మార్క్‌ని చేరుకుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్లతో కలుపుకుని మంగళవారం వరకు ఈ సినిమా $ 525,215 (రూ. 3.58 కోట్లు) కలెక్ట్ చేసింది. ఖైదీ, శాతకర్ణిలాంటి భారీ సినిమాల పోటీ మధ్య.. కేవలం ఐదు రోజుల్లోనే అలవోకగా హాఫ్ మిలియన్ క్లబ్‌లోకి ఈ సినిమా చేరడం నిజంగా విశేషం. ఈ చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో.. ఇలా వసూళ్లు రాబడుతోందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news