Newsసినిమాల్లో అవకాశాలు ఇస్తానని మోడల్‌ని రేప్ చేసిన షారుఖ్ ఖాన్ నిర్మాత

సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మోడల్‌ని రేప్ చేసిన షారుఖ్ ఖాన్ నిర్మాత

Bollywood producer karim morani booked under Nirbhaya act for raping a model in Hyderabad during Dilwale movie shooting.

సినిమాల్లో అవకాశాలు ఇస్తానని స్వయంగా నిర్మాత చెబితే ఎవరైనా ఊరికే ఉంటారా..? ఎగిరి గంతులేస్తారు. అతను ఏం చెబితే అది వింటారు.. ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇక అమ్మాయిలైతే సర్వస్వం సమర్పించుకోవడానిక్కూడా రెడీ అయిపోతారు. ఇలాగే ఒక యువతి ఓ ప్రొడ్యూసర్ చెప్పిన మాయమాటలు నమ్మి.. అతనికి పడకసుఖం అందించింది. ఇలా చేయడం ఆమెకి ఇష్టం లేకపోయినప్పటికీ.. సినిమా ఛాన్స్‌లు వస్తాయన్న నమ్మకంతో తప్పనిసరి పరిస్థితుల్లో లొంగాల్సి వచ్చింది.

ఆ ఒక్క ఇన్సిడెంట్‌ని అడ్డం పెట్టుకుని ఆ నిర్మాత ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమెని బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడు. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ నిర్మాత మరెవ్వరో కాదు.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘దిల్‌వాలే’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘రా.వన్’ సినిమాల్ని రూపొందించిన కరీమ్ మురానీ. ఇప్పటికే సెక్ట్రం కుంభకోణంలో నిందితుడిగా ఉంటూ అరెస్ట్ అయి, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన మురానీ.. తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి తనపై అత్యాచారం జరిపాడని బాధిత యువతి ఆరోపిస్తోంది.

‘దిల్‌వాలే’ షూటింగ్ సమయంలో హైదరాబాద్‌లోని హయత్ నగర్ సమీపంలో తనని రేప్ చేశాడని, ఒకసారి మత్తుమందు ఇచ్చి మరీ తనపై అత్యాచారం జరిపాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన నగ్న ఫోటోలు తీసి, అప్పటినుంచి బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తున్నాడని, ఆ ఫోటోలని అడ్డం పెట్టుకుని చాలాసార్లు రేప్ చేశాడని ఆరోపించింది. ఈ విషయాల్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని.. కానీ రానురాను అతని వేధింపులు మరింత ఎక్కువవుతుండడంతో భరించలేక ఫిర్యాదు చేసినట్లుగా ఆమె వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు.. హయత్ నగర్ పోలీసులు కరీమ్‌పై కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news